క్రీడాకారులకు ప్రోత్సాహం
సాక్షి, చైన్నె : వివిధ క్రీడలోరాణించిన, పోటీలకు బయలు దేరుతున్నక్రీడాకారులకు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ప్రోత్సహకాలను అందజేసింది. ఆమేరకు ఇటీవల బహ్రెయిన్‌లో 3వ ఆసియా యూత్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్ పోటీలలో డా పోటీలో రజత పతకం గెలుచుకున్న తమిళనాడు అథ్లెట్ ఎ. మహారాజన్‌కు రూ. 25 లక్షల ప్రోత్సాహక చెక్కును డిప్యూటీ సీఎం ఉదయ నిధి స్టాలిన్, క్రీడల శాఖ కార్యదర్శి అతుల్య మిశ్రా, స్పోర్ట్స్ డెవలప్‌మెంట్ అథారిటీ సభ్య కార్యదర్శి జే మేఘనాథరెడ్డిలు అందజేశారు. అలాగే,ఈనెల 21 నుంచి 30 వరకు అబుదాబిలో జరగనున్న ప్రపంచ సీనియర్ కిక్ బాక్సింగ్‌ఛాంపియన్ షిప్‌లో పాల్గొనేందుకు ఎంపికై న 11 మంది క్రీడాకారులకువసతి,ప్రయాణ ఖర్చుల నిమిత్తం ఒకొక్కరికి రూ.1.75 లక్షలు చొప్పున మొత్తం రూ. 19.25 లక్షలకు గాను చెక్కులను అందజేశారు. తమిళనాడు స్పోర్ట్స్ డెవలప్‌మెంట్ అథారిటీ హాస్టల్ కొనసాగుతున్న 5 బాస్కెట్‌బాల్ క్రీడాకారులు , అథ్లెట్లకు క్రీడా పరికరాల కొనుగోలునిమిత్తం రూ. 2.75 లక్షలు అందజేశారు. ఇక పారా–ఫెన్సింగ్ అథ్లెట్ షెరంతి థామస్‌కు తమిళనాడు ఛాంపియన్స్ ఫౌండేషన్ నుంచి రూ. 1,64,500 చెక్కును అందజేశారు. తమిళనాడు ఛాంపియన్స్ ఫౌండేషన్ ద్వారా ఇప్పటివరకు 481 మందిపారా అథ్లెట్లకు, 4,082 ఇతర క్రీడాకారులకు అంతర్జాతీయ పోటీలలో పాల్గొనేందుకు ప్రోత్సహం అందించినట్టు ప్రభుత్వం ప్రకటించింది.ఈ కార్యక్రమంలో తమిళనాడు క్రీడా అభివృద్ది కమిషన్ వైస్ చైర్మన్ డాక్టర్ అశోక్ సికామణి, ఇతర అధికారులతో పాటూ క్రీడాకారులు పాల్గొన్నారు.
మహారాజన్‌కు చెక్కు అందజేస్తున్న ఉదయనిధి, అతుల్య మిశ్ర, మేఘనాథరెడ్డి
చెక్కులను అందుకున్న బాక్సర్లు
క్రీడాకారులకు ప్రోత్సాహం


