20 ఎర్రచందనం దుంగల స్వాధీనం
తిరుపతి అన్నమయ్యసర్కిల్: శ్రీకాళహస్తి అటవీ పరిధిలో 20 ఎరచ్రందనం దుంగలను స్వాధీనం చేసుకుని, 9 మంది నిందితులను అరెస్టు చేసినట్లు టాస్క్‌ఫోర్స్ పోలీసులు తెలిపారు. టాస్క్‌ఫోర్స్ ఎస్పీ శ్రీనివాస్ సూచనల మేరకు డీఎస్పీ ఎండీ షరీఫ్ నేతృత్వంలో ఆర్‌ఐ సాయి గిరిధర్, ఏఆర్‌ఎస్‌ఐ ఎన్.ఈశ్వర రెడ్డి బృందం శ్రీకాళహస్తి అటవీ పరిధిలో కూంబింగ్ చేపట్టింది. బుధవారం తెల్లవారుజామున రాగిగుంట సెక్షన్, తీర్థాలపాలకోనకు చేరుకున్నారు. అక్కడ కొంతమంది వ్యక్తులు గుమికూడి కనిపించారు. వారిని సమీపించడంతో పారిపోయే ప్రయత్నం చేశారు. వెంబడించిన టాస్క్‌ఫోర్స్ టీమ్ వారిని చుట్టుముట్టి 9 మందిని అదుపులోకి తీసుకున్నారు. సమీప ప్రదేశాలను పరిశీలించగా 20 ఎరచ్రందనం దుంగలు లభించాయి. పట్టుబడిన వారిలో ఇద్దరు తిరుపతి జిల్లాకు చెందిన వారు కాగా, ఏడుగురు తమిళనాడుకు చెందిన వారుగా గుర్తించారు. వీరిని దుంగలతో సహా తిరుపతి టాస్క్ ఫోర్స్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. డీఎస్పీ శ్రీనివాసరెడ్డి, ఏసీఎఫ్ శ్రీనివాస్ నిందితులను విచారించిన అనంతరం ఎస్‌ఐ రఫీ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


