సంగమేశ్వరర్ ఆలయంలో అన్నాభిషేకం
పళ్లిపట్టు: ఐపసి పౌర్ణమి సందర్భంగా పళ్లిపట్టు సంగమేశ్వరాలయంలో బుధవారం అన్నాభిషేకం నిర్వహించారు. భారీ సంఖ్యలో భక్తులు స్వామి దర్శనం చేసుకున్నారు. పళ్లిపట్టులోని పార్వతి సమేత సంగమేశ్వరర్ ఆలయంలో అన్నాభిషేకం సందర్భంగా వేకువజామున సంగమేశ్వరర్ లింగంకు ప్రత్యేక అభిషేక పూజలు నిర్వహించారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అన్నం, పండ్లు, కూరగాయలతో లింగం ఆకారంలో సంగమేశ్వరస్వామిని అలంకరించి దీపారాధన పూజలు చేశారు. ఇందులో పళ్లిపట్టు పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని శివనామస్మరణతో స్వామి దర్శనం చేసుకున్నారు. అనంతరం శివుడి వాహనం భైరవుడికి అలంకరణ చేసి రుద్రాక్షమాల, వడమాలతో అలంకరించి మేళ తాళాల నడుమ పట్టణ వీధుల్లో ఊరేగించారు. ఇందులో మహిళలు, భక్తులు పాల్గొని చివరగా కుశస్థలి నదిలో బైరవుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నాభిషేకం చేసిన ప్రసాదాలను నది జలాల్లో కలిపి దర్శించుకున్నారు.
సంగమేశ్వరర్‌కు అన్నాభిషేకం, భైరవుని ఊరేగింపు
సంగమేశ్వరర్ ఆలయంలో అన్నాభిషేకం


