వైభవం..సత్యనారాయణస్వామి వ్రతం
కొరుక్కుపేట: కార్తీక పౌర్ణమి సందర్భంగా మొగప్పైర్ తెలుగు కల్చరల్ అండ్ సోషల్ అసోసియేషన్‌న్ (ఎంటీఎఎస్‌ఏ) ఆధ్వర్యంలో మొగప్పేర్‌లోని సంతాన పెరుమాళ్ ఆలయ కల్యాణ మండపంలో వైభవంగా సామూహిక సత్యనారాయణ వ్రతం బుధవారం జరిగింది. మహోత్సవంలో 400 మంది భక్తులు పాల్గొన్నారు. అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ గిరి హనుమంతరావు మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాలు తెలుగు సంస్కృతి, సంప్రదాయ గొప్పతనాన్ని, భక్తుల ఐక్యతను ప్రదర్శిస్తున్నాయని వర్ణించారు. కమిటీ సభ్యులు భాస్కరరావు అసోసియేషన్ సభ్యులు టీఎంకే కుమార్, వీవీరావు, ఇక్కుర్తి సురేష్‌బాబు, మోహన్‌నాయుడు , నిర్మల్, వై.గిరి, భాస్కరరావు, ఢిల్లీబాబు, సురేష్‌బాబు పాల్గొన్నారు.


