ఐ లవ్‌యూ అనగానే ఓకే చెప్పేశా
తమిళసినిమా: జీవితంలో ప్రతి ఒక్కరికీ తొలి ప్రేమ అనుభవాలు ఉంటాయి. అవి తలుచుకుంటే మధురానుభూతి కలుగుతోంది. అలాంటి అనుభూతిని నటి అనుష్క గుర్తు చేసుకున్నారు. దక్షిణాది చిత్ర సీమలో మోస్ట్ వాంటెడ్ బ్యాచిలర్ హీరోయిన్లలో ఈమె ఒకరు. ఈ భామ వయసు 43 ఏళ్లు. 2005లో కథానాయకిగా ఎంట్రీ ఇచ్చిన ఈ బె బెంగళూరు బ్యూటీ మొదటి చిత్రం సూపర్. నాగార్జునకు జంటగా నటించిన ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ఆ తరువాత తెలుగు, తమిళం భాషల్లో నటిస్తూ అగ్ర కథానాయకిగా రాణిస్తున్నారు. సైజ్ జీరో చిత్రంలో నటించడానికి ఈమె బరువు పెరిగారు. ఆ తరువాత ఆ సమస్య నుంచి బయట పడలేకపోయారు. కాగా కారణాలేమైనా ఇటీవల చిత్రాల్లో నటించడం తగ్గించారు. ఈమె తాజాగా నటించిన ఘాటి చిత్రం కూడా ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. కాగా ఇప్పుడు కాత్తనర్ అనే ఒకే ఒక్క మళయాల చిత్రం ఈమె చేతిలో ఉంది. అదే అనుష్క నటిస్తున్న తొలి మలయాళ చిత్రం అన్నది గమనార్హం. కాగా అనుష్క ప్రేమ గురించి చాలా ప్రచారం వైరల్ అయ్యింది. కానీ ఇప్పుటికీ ఈ భామ అవివాహితగానే ఉన్నారు. కాగా ఇటీవల ఒక భేటీలో ఈమె తన తొలి ప్రేమ వ్యవహారాన్ని గుర్తు చేసుకున్నారు. తాను ఆరో తరగతి చదువుతున్న సమయంలో ఒక కుర్రాడు తన వద్దకు వచ్చి ఐలవ్‌యూ అని చెప్పారన్నారు. అప్పట్లో ఐ లవ్‌యూ అంటే అర్థం ఏమిటో కూడా తెలియని వయసన్నారు. అయినా ఆ కుర్రాడు అలా చెప్పడంతో తాను వెంటనే ఓకే చెప్పేశానన్నారు. అదే ఇప్పటికీ తన జీవితంలో అందమైన జ్ఞాపకం అని నటి అనుష్క పేర్కొన్నారు. కాగా ఈ భామ తాజాగా ఒక తెలుగు చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.


