కనులపండువగా శివసుబ్రహ్మణ్యస్వామి కల్యాణం | - | Sakshi
Sakshi News home page

కనులపండువగా శివసుబ్రహ్మణ్యస్వామి కల్యాణం

Oct 30 2025 9:28 AM | Updated on Oct 30 2025 9:28 AM

కనులప

కనులపండువగా శివసుబ్రహ్మణ్యస్వామి కల్యాణం

తిరువొత్తియూర్‌: శ్రీవళ్లి, దేవసేన సమేత శివసుబ్రహ్మణ్యస్వామివారి తిరుకల్యాణ మహోత్సవం మంగళవారం రాత్రి వైభవంగా జరిగింది. చైన్నె పాతచాకలిపేట బసవయ్య వీధిలో ఉన్న కపిల వినాయక దేవస్థానంలో స్కంధ షష్ఠి లక్షార్చన వైభవాలు–2025 ఘనంగా జరుగుతున్నాయి. ఈ నెల 21వ తేదీ నుంచి ఈ వేడుకలు జరుగుతుండగా ప్రతిరోజు అభిషేకాలు, దీపారాధన చేస్తున్నారు.

ఈ క్రమంలో మంగళవారం రాత్రి శ్రీవళ్లి దేవసేన సమేత శివసుబ్రహ్మణ్యస్వామివారి కల్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కల్యాణోత్సవానికి మహిళలు, పెద్దలు, చిన్నారులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. భక్తులందరికీ ప్రసాద వినియోగం చేశారు.

కల్యాణోత్సవంలో పాల్గొన్న మహిళలు

విశేషాలంకరణలో శివసుబ్రహ్మణ్యస్వామి

కనులపండువగా శివసుబ్రహ్మణ్యస్వామి కల్యాణం1
1/1

కనులపండువగా శివసుబ్రహ్మణ్యస్వామి కల్యాణం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement