విజయవంతంగా స్ట్రోక్ రివర్సల్ ప్రోగ్రామ్
సాక్షి, చైన్నె : చైన్నెలోని కావేరి ఆస్పత్రిలో స్ట్రోక్‌కు గురైన వందలాది మందికి సకాలంలో అందించిన వైద్య చికిత్సలు, సంరక్షణ, ప్రాణ రక్షణ గురించి వివరించే రీతిలో నాలుగున్నర గంటల స్ట్రోక్ రివర్సల్ ప్రోగ్రామ్ బుధవారం విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఐఏఎస్ అధికారి డాక్టర్ విజయ కార్తికేయన్ ప్రారంభించారు. స్ట్రోక్‌కు గురైన వారికి గంటలలోపు చికిత్స అందించేలా ప్రత్యేక చొరవతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. రెండేళ్లలో చైన్నె అంతటా కావేరి హాస్పిటల్ స్ట్రోక్ బృందాలు 956 స్ట్రోక్ కేసులను పరిష్కరించినట్టు తెలిపారు. ‘ఒకరికి స్ట్రోక్ వచ్చినప్పుడు, ప్రతి నిమిషం ముఖ్యమైనదని, గడిచే ప్రతి క్షణం వేలాది మెదడు కణాల నష్టాన్ని సూచిస్తుందని ఈసందర్భంగా వడపళనిలోని కావేరీ హాస్పిటల్‌లోని ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ డాక్టర్ పెరియకరుప్పన్ తెలిపారు. రోగులు త్వరగా ఆస్పత్రికి చేరుకుంటే ప్రాణాలను కాపాడగలమన్నారు. స్ట్రోక్ చికిత్స అనేది సైనన్స్, కచ్చితత్వం సమష్టి కృషికి సంబంధించినదని రేడియల్ రోడ్‌లోని కావేరి హాస్పిటల్‌లోని ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ (న్యూరో) సీనియర్ కన్సల్టెంట్ – క్లినికల్ లీడ్ డాక్టర్ జి సతీష్ తెలిపారు. ఆస్పత్రి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ అరవిందన్ సెల్వరాజ్ మాట్లాడుతూ తమ లక్ష్యం స్ట్రోక్‌కు చికిత్స చేయడమే కాదు, దానికి నగరం ప్రతిస్పందనను మార్చడం అవశ్యమన్నారు. ప్రతి పౌరుడు సంకేతాలను గుర్తించి స్ట్రోక్‌కు సిద్ధంగా ఉన్న వెంటనే ఆస్పత్రికి చేరుకోగలిగితే, ప్రాణాలు నిలుపుకోవచ్చన్నారు.


