జిల్లాలో 554.6మిమీల వర్షపాతం
తిరువళ్లూరు: జిల్లా వ్యాప్తంగా 554.60 మి.మీల వర్షపాతం నమోదు కాగా అఽత్యధికంగా పొన్నేరిలో 72మి.మీ, అత్యల్పంగా ఆర్కే పేటలో 4.6మిమీ వర్షపాతం నమోదైనట్టు అధికారులు వెల్లడించారు. తిరువళ్లూరు జిల్లా వ్యాప్తంగా సోమవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. జిల్లా వ్యాప్తంగా 554.60 మి.మీల వర్షపాతం నమోదైంది. సరాసరిన 36.97 మి.మీల వర్షపాతం నమోదైంది. కాగా తిరువళ్లూరు జిల్లా వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు రెండు గుడిసెలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఇప్పటి వరకు పది పశువులు నీటిలో కొట్టుకపోయాయి. జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షం కారణంగా చెరువులకు భారీగా నీరు చేరుతోంది.
జిల్లాలో 554.6మిమీల వర్షపాతం


