తిరువళ్లూరు: కందషష్టి ఉత్సవాల్లో భాగంగా జిల్లాలోని సుబ్రహ్మణ్యస్వామి ఆలయాల్లో వళ్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి తిరుకల్యాణ ఉత్సవం మంగళవారం ఉదయం వైభవంగా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా ఆరవ రోజు సూరసంహారం, ఏడవ రోజు ఉదయం స్వామివారి తిరుకల్యాణ ఉత్సవం వైభవంగా జరిగింది. తిరుకల్యాణ ఉత్సవాల్లో భాగంగా ఉదయం ఆరుగంటలకు మంగళవాయిద్యం, ఏడు గంటలకు అభిషేకం, 8 గంటలకు ప్రత్యేక ఆరాధన, 9 గంటలకు తిరుమురై, తిరుపుగల్ ఉత్సవాలను నిర్వహించారు. అనంతరం 10.30 గంటలకు తిరుకల్యాణ ఉత్సవాలు నిర్వహించారు. ఉత్సవాల్లో వందలాది మంది భక్తులు పాల్గొన్నారు. కాగా ఉత్సవాల్లో పాల్గొన్న వారికి మంగళసూత్రాలతోపాటు ప్రసాదాలను ఆలయ నిర్వాహకులు అందజేశారు.
సేలంలో..
సేలం: ఈరోడ్‌లోని తిండల్ వేలాయుధస్వామి ఆలయంలో వేలాయుధస్వామికి, వళ్లి,దేవసేన సమేతంగా తిరుకల్యాణం జరిపించి ఉత్సవ రూపంలో భక్తులకు స్వామివారు దర్శనమిచ్చారు.
వైభవం.. సుబ్రహ్మణ్యస్వామి తిరుకల్యాణం
వైభవం.. సుబ్రహ్మణ్యస్వామి తిరుకల్యాణం


