ప్రయాణికురాలిని కాపాడిన ఆర్పీఎఫ్ కానిస్టేబుల్
సేలం: ఈరోడ్ రైల్వే స్టేషన్‌కు రోజూ వందకు సగటున పైగా రైళ్లు వస్తాయి. ఈ పరిస్థితిలో మంగళవారం తెల్లవారుజామున ఈరోడ్ నుంచి చైన్నె సెంట్రల్ వెళ్లే ఏర్కాడ్ ఎక్స్‌ప్రెస్ రైలు ఈరోడ్ రైల్వే స్టేషన్‌లోని మూడవ ప్లాట్‌ఫారం నుంచి బయలుదేరింది. ఆ సమయంలో దాదాపు 20 ఏళ్ల వయసున్న ఓ మహిళ పరిగెడుతూ కదులుతున్న రైలు ఎక్కడానికి యత్నించారు. ఈక్రమంలో అకస్మాత్తుగా అదుపు తప్పి, కిందపడి, రైలు, ప్లాట్‌ఫారమ్ మధ్య ఇరుక్కుపోయి వేలాడుతోంది. ఇది చూసి తోటి ప్రయాణికులు కేకలు వేశారు. ఆ సమయంలో, పెట్రోలింగ్‌లో ఉన్న జగతీసన్ అనే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కానిస్టేబుల్ సకాలంలో స్పందించి ఆ ప్రయాణికురాలిని లాగి, ఆమె ప్రాణాలను కాపాడాడు. దీంతో ప్రయాణీకురాలు అదృష్టవశాత్తూ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ దృశ్యాలన్నీ రైల్వే స్టేషన్‌లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి.
గంజాయితో కలెక్టర్ కార్యాలయానికి వచ్చిన మహిళ అరెస్టు
అన్నానగర్: మూలపుదూర్ ప్రాంతానికి చెందిన గణేషన్ భార్య ముత్తులక్ష్మి (51) సోమవారం జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం లో పిటిషన్ సమర్పించడానికి సేలం జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వచ్చింది. ఆమె తీసుకెళ్తున్న బ్యాగును పోలీసులు తనిఖీ చేసినప్పుడు, అందులో 10 గ్రాముల గంజాయి ఉన్నట్లు గుర్తించి దానిని స్వాధీనం చేసుకున్నారు. నకు చర్మ వ్యాధి ఉన్నందున తనకు తెలిసిన వ్యక్తి ఈ (గంజాయి) స్థానిక మందుగా ఇచ్చాడని కూడా ఆమె పోలీసులకు చెప్పింది. అది గంజాయి అని నాకు తెలియదు? అని ఆమె చెప్పింది. అయినా పోలీసులు ముత్తులక్ష్మి అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.
ప్రయాణికురాలిని కాపాడిన ఆర్పీఎఫ్ కానిస్టేబుల్


