తప్పిన మోంథా ముప్పు
చిరు జల్లులతో సరి
ఆవడి, ఎన్నూరు పరిసరాలలో భారీ వర్షం
క్షణ..క్షణం అప్రమత్తంగా అధికార యంత్రాంగం
మోంథా గండం నుంచి చైన్నె మహానగరం దాని శివారు జిల్లాలు గట్టెక్కాయి. ఈ తుపాన్ ప్రభావంతో మంగళవారం కూడా చిరు జల్లులు కురిశాయి. ఆవడి, ఎన్నూరు పరిసరాలలో అయితే, భారీ వర్షం పడింది. అయితే భారీ వర్షాల ముప్పు తప్పడంతో ఎలాంటి గండం ఎదురు అవుతుందో..? అన్న ఉత్కంఠతో అధికార యంత్రాంగం క్షణ..క్షణం అప్రమత్తంగా వ్యవహరించింది.
సాక్షి, చైన్నె: ఈశాన్య రుతు పవనాల ప్రభావంతో రాష్ట్రంలో పలు జిల్లాలలో ఇప్పటికే ఆశాజనకంగా వర్షాలు పడ్డ విషయం తెలిసిందే. చైన్నె, శివారులలోని రిజర్వాయర్లు ఇప్పటికే నిండు కుండలుగా మారాయి. ఈ పరిస్థితుల్లో బంగాళాఖాతంలో నెలకొన్న మోంథా రూపంలో చైన్నె, చెంగల్పట్టు, తిరువళ్లూరు, కాంచీపురం తదితర ఉత్తర తమిళనాడులోని జిల్లాలపై వర్షం ప్రభావం ఉంటుందని వాతావరణ పరిశోధకులు అంచనా వేశారు. ఇది చైన్నెకు సమీపంలో ప్రయాణించి ఆంధ్రా వైపుగా వెళ్తుందని తొలుత భావించారు. అయితే మోంథా తుపాన్ చైన్నెకు సమీపంలో కాకుండా, కాస్త దూరంగానే ప్రయాణించడంతో గండం తప్పినట్లయ్యింది. సోమవారం నుంచి చైన్నె, శివారు జిల్లాలో చిరు జల్లుల వర్షం పడుతూనే వచ్చింది. మంగళవారం కూడా ఇది కొనసాగింది. సుమారు 35 గంటల పాటూ చైన్నె, శివారులలో చిరు జల్లులతో వాన నిరంతరాయంగా కురిసింది. అప్పుడప్పుడూ అనేక చోట్ల ఈదురు గాలులు కాస్త వణికించాయి. అయితే ఉత్తర చైన్నె పరిధిలో కొన్నిచోట్ల, తిరువళ్లూరు జిల్లా పరిధిలో మరికొన్ని చోట్ల తెరపించి తెరపించి వర్షం పడింది. తిరునెండ్రవూరు, ఆవడి పరిసరాలు, ఎన్నూరు పరిసరాలలో భారీ వర్షం పడింది. ఎన్నూరులో 13 సెం.మీ వర్షం పడింది. ఆవడి పరిసరాలలోని కొన్ని చెరువులు నిండు కుండగా మారడంతో అక్కడి ఇళ్లలోకి నీళ్లు చేరాయి. ఎన్నూరు పరిసరాలలోనే ఇదే పరిస్థితి నెలకొనడంతో నీటి తొలగింపునకు అధికారులు ఉరకలు తీశారు. మంగళవారం రాత్రి సమయంలో చిరు జల్లుల వాన సైతం ఆగినట్టైంది. మోంథా రూపంలో ప్రభావం లేనప్పటికీ, మరో వారం పది రోజులు గాలిలో తేమ తగ్గే అవకాశాలు అధికంగా ఉన్నాయి. నవంబర్ రెండో వారంలో మళ్లీ వర్షాలకు అవకాశం ఉన్నట్టు వాతావరణ పరిశోధకులు పేర్కొంటున్నారు. నవంబర్, డిసెంబర్ నెలలలో రెండు తుపాన్‌లకు అవకాశం ఉన్నట్టు, వీటి ప్రభావం తమిళనాడుపై అధికంగాఉండవచ్చని భావిస్తున్నారు. ఇక ఈశాన్య రుతు పవనాలతో పశ్చిమ కనుమలలో తేని, తెన్‌కాశి, తిరునల్వేలి, కన్యాకుమారి జిల్లాలలో వర్షాలు కొనసాగుతున్నాయి.
అప్రమత్తంగా..
మోంథా రూపంలో భారీ వర్షం కురిసిన పక్షంలో ఎదుర్కొనే విధంగా మంగళవారం అధికార యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరించారు. సబ్ వేలు, లోతట్ట ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఎలాంటి విపత్తు ఎదురు అవుతుందో అన్న ఉత్కంఠతో అప్రమత్తంగా ముందడుగు వేశారు. ఎమర్జెన్సీ కంట్రోల్ రూంలో డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ తిష్ట వేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను స్వీకరించి పరిష్కరించేందుకు చర్యలు తీసుకున్నారు. అలాగే పలుచోట్ల పేదలకు అల్పాహారం పంపిణీ చేశారు. సుమారు 54 వేల మందికి ఆహారం ప్యాకెట్లను అందజేశారు. ఎన్నూరు పరిసరాలలో సముద్రం కోతకు గురి కాకుండా ఇసుక బస్తాలను సిద్ధం చేసి ఆగమేఘాలపై కట్టడిచర్యలు అధికారులు తీసుకున్నారు. ఇక ఆంధ్రా వైపుగా వెళ్లే అనేకరైళ్ల సేవలలో మార్పులు చేశారు. చైన్నె సెంట్రల్ – హౌరా, విశాఖపట్నం, విల్లుపురం– ఖరగ్ పూర్, చైన్నె సెంట్రల్ – హౌరా సూర్ ఫాస్ట్ మెయిల్, తిరుచ్చి – హౌరా, తదితర రైళ్లుందులో ఉన్నాయి. అలాగే, పలు విమానాల సేవలు రద్దు చేశారు. ఆంధ్రా వైపుగా వెళ్లే ఆరు విమాన సేవలు రద్దు కాగా, మరో ఆరు విమానాల వేళలో మార్పులు చేశారు
తప్పిన మోంథా ముప్పు
తప్పిన మోంథా ముప్పు
తప్పిన మోంథా ముప్పు
తప్పిన మోంథా ముప్పు
తప్పిన మోంథా ముప్పు
తప్పిన మోంథా ముప్పు
తప్పిన మోంథా ముప్పు


