ముగ్గురు ప్రొఫెసర్లకు రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కార్ –
న్యూస్‌రీల్
కొరుక్కుపేట: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) మద్రాస్ నుంచి ముగ్గురు ప్రొఫెసర్లు రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కార్ 2025’ కు ఎంపికయ్యాయి. సైనన్స్, టెక్నాలజీ రంగాల్లో విశేష ప్రతిభాపాటవాలు ప్రదర్శించిన వారికి కేంద్ర శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వశాఖ రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కార్‌లను అందిస్తూ వస్తున్నారు. 2025 సంవత్సరానికి గాను రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కార్ 2025లను శాస్త్ర పరిశోధన విభాగాల్లో అద్భుత నైపుణ్యాలు ప్రదర్శించిన ముగ్గురు ఐఐటీ మద్రాసు ప్రొఫెసర్‌లను వరించింది. ఇందులో ఐఐటీ మద్రాస్ కెమిస్ట్రీ ప్రొఫెసర్ తలప్పిల్ ప్రదీప్‌తో పాటూ ప్రొఫెసర్ మోహనశంకర్ శివప్రకాశం, ప్రొఫెసర్ శ్వేత ప్రేమ్ అగర్వాల్ ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఐఐటీ మద్రాసు డైరెక్టర్ ప్రొఫెసర్ వి.కామకోటి రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కార్ 2025కు ఎంపికై న ముగ్గురు ప్రొఫెసర్‌లకు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఆగని బాంబు బెదిరింపుల పర్వం
సాక్షి, చైన్నె : బాంబు బూచీలు పోలీసులను వెంటాడుతున్నాయి. మంగళవారం పలు చోట్ల వచ్చిన బెదిరింపు మెయిల్స్, కాల్స్‌తో పోలీసులు పరుగులు తీశారు. గత నెల రోజులుగా చైన్నెలో అక్కడ, ఇక్కడ బాంబులు ఉన్నాయంటూ వస్తున్న బెదిరింపు మెయిల్స్ పోలీసులకు సవాలుగామారిన విషయం తెలిసిందే. ఈ బెదిరింపు ఇస్తున్న వారిని పసిగట్టడం శ్రమగా మారింది. ఇది వరకు సీఎం, డిప్యూటీ సీఎంలతోపాటూ కీలక వ్యక్తులు, నాయకుల ఇళ్లు, కార్యాలయాలకు సైతం బెదిరింపు వచ్చింది. తాజాగా సినీ నటులు రజనీకాంత్, ధనూష్, కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత సెల్వ పెరుంతొగై నివాసాలకు బెదిరింపు వచ్చాయి. ఇక బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామిని హతమారుస్తామంటూ డీజీపీ కార్యాలయానికి ఈ మెయిల్‌రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. అన్ని చోట్లా సోదాలు జరపగా, ఎక్కడ ఎలాంటి బాంబు అన్నది లభించ లేదు. ఇక, సుబ్రహ్మణ్య స్వామికి భద్రత పెంచేందుకు చర్యలు చేపట్టారు.
8 నుంచి క్విజ్ పోటీలు
సాక్షి, చైన్నె: బాటిల్ ఆఫ్ బ్రెయిన్స్ పేరిట ఇంటర్ స్కూల్ క్విజ్ పోటీల్లో పాల్గొనే విద్యార్థులకు కాసాగ్రాండ్ ఆహ్వానం పలికింది. నవంబర్ 8 నుంచి జరగనున్న ఈ క్విజ్ పోటీలు చైన్నెలోని పాఠశాలల విద్యార్థుల ప్రతిభను చాటే విధంగా నిర్వహించేందుకు నిర్ణయించారు. పోటీల్లో పాల్గొనే విద్యార్థులు 6 నుంచి 9 తరగతుల వారై ఉండాలని సూచించారు. విద్యార్థులను ఆరు జట్లుగా విభజించి పోటీలను నిర్వహించున్నామని, ఆశావహులు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.కాసాగ్రాండ్‌కో.ఇన్‌లో తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు అని సూచించారు. విజేతలకు ప్రతిష్టాత్మక ట్రోఫీతో పాటు రూ.1.50 లక్షల బహుమతి, రన్నర్ జట్టుకు రూ.80 వేలు అందజేయనున్నామని ప్రకటించారు.
ముగ్గురు ప్రొఫెసర్లకు రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కార్ –
ముగ్గురు ప్రొఫెసర్లకు రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కార్ –


