క్లుప్తంగా | - | Sakshi
Sakshi News home page

క్లుప్తంగా

Oct 29 2025 7:51 AM | Updated on Oct 29 2025 7:51 AM

క్లుప

క్లుప్తంగా

● నిందితుడికి 13 జైలు శిక్ష ●తల్లి, కుమార్తె అరెస్టు

13 ఏళ్ల బాలికపై లైంగిక దాడి

తిరువళ్లూరు: 13 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తికి 13 ఏళ్లు జైలు శిక్షతో పాటూ రూ.16 వేలు జరిమానా విధిస్తూ తిరువళ్లూరు జిల్లా పోక్సో కోర్టు న్యాయమూర్తి తీర్పును వెలువరించారు. వివరాలు.. తిరువళ్లూరు జిల్లా ఒరగడం ప్రాంతానికి చెందిన ఆళగరసన్‌(37). ఇతను గత 2019వ సంవత్సరంలో తిరుములైవాయల్‌ ప్రాతంలో నివాసం ఉంటున్న తమ సమీప బంధువైన 13 ఏళ్ల బాలిక ఇంటికి వెళ్లి లైగింక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఆవడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తును చేపట్టిన పోలీసులు నిందితుడ్ని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ప్రస్తుతం బెయిల్‌పై వున్న నేపథ్యంలో కేసు విచారణ తిరువళ్లూరు పోక్సో న్యాయస్థానంలో సాగింది. విచారణ పూర్తి కావడంతో న్యాయమూర్తి ఉమామహేశ్వరి తీర్పును వెలువరించారు. 13 బాలికపై లైగింక దాడికి పాల్పడిన అళగరసన్‌కు 13 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పును వెలువరించారు. అనంతరం నిందితుడిని పుళల్‌ జైలుకు తరలించారు.

అక్కడమ్మాయి..

ఇక్కడబ్బాయి

అన్నానగర్‌: రామనాథపురంలోని ఓంశక్తి నగర్‌కు చెందిన సుబ్రమణియన్‌ కుమారుడు దీపన్‌ కుమార్‌ (30) ఖత్తార్‌లోని ఓ కంపెనీలో పనిచేస్తున్నాడు. తనతో పాటూ పనిచేసే ఫిలిప్పీన్స్‌ యువతి అర్ష (28) తో ప్రేమలో పడ్డాడు. వారి ప్రేమ 5 సంవత్సరాలు కొనసాగింది. ఇద్దరూ వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. దీని తరువాత, దీపన్‌ కుమార్‌ తన స్వస్థలంలో తమిళ సాంస్కృతిక ఆచారాల ప్రకారం వివాహం చేసుకోవాలనే కోరికను అర్షకు వ్యక్తం చేశాడు. ఆమె దీనికి అంగీకరించింది. ఈ క్రమంలో సోమవారం వీరి వివాహం తమిళ సాంస్కృతి ఆచారాల ప్రకారం రామనాథపురంలో ఘనంగా జరిగింది.

13 సవర్ల నగలు చోరీ

అన్నానగర్‌: చైన్నె సమీపం అంబత్తూరులోని జ్ఞానమూర్తి నగర్‌ ప్రాంతంలో నివసించే బ్యూలా (46) ఓ ప్రైవేట్‌ కంపెనీ ఉద్యోగి. ఈమె తల్లి ప్రేమ, ఆమె సోదరితో నివసిస్తుంది. వీరి ఇంటి కింద రేవతి తన కుటుంబంతో నివసిస్తోంది. ఈనేపథ్యంలో రేవతి బ్యూలా తల్లి ప్రేమతో మాట్లాడుతున్నట్లు నటిస్తుండగా.. రేవతి కుమార్తె ప్రేమ ఇంటిలోనికి చొరబడి చాకచక్యంగా 13 సవర్ల నగలు దొంగిలించింది. దీంతో బ్యూలా 16వ తేదీన అంబత్తూరు క్రైమ్‌ బ్రాంచ్‌లో ఫిర్యాదు చేసింది. దాని ఆధారంగా, అంబత్తూరు క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ప్రేమ తనకు రేవతిపై అనుమానం ఉందని పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితిలో, దీపావళి సందర్భంగా రేవతి తన స్వస్థలం శ్రీవిల్లిపుత్తూర్‌కు వెళ్లింది. దీపావళి తర్వాత చైన్నెకి తిరిగి వచ్చిన తర్వాత, అంబత్తూరు క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు ఆమెను అరెస్టు చేసి విచారణ కోసం పోలీస్‌ స్టేషన్‌కు తీసుకువచ్చారు. దర్యాప్తులో భాగంగా నగలు దొంగిలించినట్లు తల్లి, కుమార్తె అంగీకరించారు. పోలీసులు వారిని అరెస్టు చేసి, వారి నుండి 13 సవర్ల నగలను స్వాధీనం చేసుకున్నారు. రేవతిని పుళల్‌ జైలుకు, ఆమె 15 ఏళ్ల కుమార్తెను జువైనల్‌ హోంకు పంపించారు.

బాలుడి దారుణ హత్య

ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు

అన్నానగర్‌: చోళవరం సమీపంలో 17 ఏళ్ల బాలుడిని అతని చేతులు, కాళ్లు కట్టి, గొంతు కోసి దారుణంగా హత్య చేశారు. ఈ విషయంపై దర్యాప్తు చేయడానికి పోలీసులు ఓ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. వివరాలు.. తిరువళ్లూరు జిల్లాలోని చోళవరం పక్కన ఉన్న ఆలమతిలోని దీరన్‌ చిన్నమలై వీధికి చెందిన బాబు (17) వెల్డింగ్‌ కార్మికుడు. బాబు కుటుంబం ఆరు నెలల క్రితం అద్దె ఇంటికి మారింది. బాబు తల్లిదండ్రులు కొన్ని రోజుల క్రితం బంధువుల ఇంటికి వెళ్లారు. బాబు ఇంట్లో ఒంటరిగా ఉన్నాడు. సోమవారం రాత్రి నుంచి బాబు సోదరుడు అతనికి ఫోన్‌ చేస్తున్నాడు, కానీ అతను ఫోన్‌ తీయకపోవడంతో, తన స్నేహితుడిని వచ్చి చూడమని అడిగాడు. అతడు లోపల తాళం వేసి ఉన్న ఇంటి తలుపు పగలగొట్టి చూడగా, బాబు చేతులు, కాళ్లు కట్టేసి, గొంతు కోసి మృతి చెందినట్లు గుర్తించి చోళవరం పోలీసులకు సమాచారం అందించారు. చోళవరం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం చైన్నెలోని స్టాన్లీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది.

క్లుప్తంగా1
1/1

క్లుప్తంగా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement