జ్వరంతో శిశువు మృతి
తిరువొత్తియూరు: చైన్నె ఆవడి హౌసింగ్ బోర్డు కాలనీలో నివాసం ఉంటున్న రాజశేఖర్ ఓ ప్రైవేట్ బ్యాంకు ఉద్యోగి. అతనికి అనన్య ఏడాది వయసున్న ఓ కుమార్తె ఉంది. గత కొన్ని రోజులుగా చిన్నారి జ్వరంతో బాధపడుతోంది. మంగళవారం ఉదయం ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఆవడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రికి వెళ్లే మార్గంలోనే అనన్య మరణించింది. ఆవడి పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు.
కొత్త కారు ఆవిష్కరణ
జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటారు ఇండియా ప్రెసిడెన్షియల్ ఎంజీ ఎం9ను సిద్ధం చేసింది. దీనిని మ్యూజిక్ మాస్ట్రో శంకర్ మహాదేవన్‌తో పాటూ ఎంజీ మోటారు ఇండియా వర్గాలు ఆవిష్కరించాయి.
– సాక్షి, చైన్నె


