ఆర్కే ఇంటర్నేషనల్ చిత్రం ప్రారంభం
నిర్మాత ఆర్‌కే రామకృష్ణ, దర్శకురాలు
శాలిన్‌జోయాలతో చిత్ర యూనిట్
తమిళసినిమా: ఇంతకుముందు 17 జనరంజకమైన చిత్రాలను నిర్మించిన ఆర్కే ఇంటర్నేషనల్ సంస్థ అధినేత కేఎస్.రామకృష్ణ తాజాగా నిర్మిస్తున్న 18వ చిత్రం పూజా కార్యక్రమాలు ఇటీవల చైన్నెలో ప్రారంభమయ్యాయి. ఈ చిత్రం ద్వారా మలయాళ నటి, దర్శకురాలు శాలిన్‌జోయాను కోలీవుడ్‌కు పరిచయం చేస్తున్నారు. ఈమె ఇంతకుముందు కన్నగి అనే చిత్రంలో నటించారు. అదేవిధంగా కుక్ విత్ కోమాలి కార్యక్రమంలో పాల్గొని పాపులర్ అయ్యారు. ఈ చిత్రంలో నక్సలైట్స్ చిత్రం ఫేమ్ అరుణ్, నటి బ్రిగిడా జంటగా నటిస్తున్నారు. ఎంఎస్.భాస్కర్, అరుళ్ దాస్, జావా సుందరేశన్, జాన్సన్ దివాకర్ ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఇందులో నటి దేవదర్శిని వినూత్న పాత్రలో నటిస్తున్నారు. అదేవిధంగా అశ్విన్ కాక్కుమణు గౌరవ పాత్రలో నటిస్తున్నారు. చిత్ర వివరాలను నిర్మాత కేఎస్ రామకృష్ణ చెపుతూ తాజాగా శాలిన్‌జోయాను ఈ చిత్రం ద్వారా దర్శకురాలిగా పరిచయం చేస్తున్నట్లు చెప్పారు. శాలిన్ జోయా మాట్లాడుతూ ఒక గ్రామంలో జరిగిన ఒక సంఘటన ఆ ప్రాంత ప్రజల జీవితాలను ఎలా మార్చేస్తుంది అనే విషయాన్ని వినోదాన్ని జోడించి ఫాంటసీ అంశాలతో తెరకెక్కిస్తున్నట్లు చెప్పారు. ప్రతిభావంతులైన కళాకారులు ,సాంకేతిక వర్గంతో కలిసి పనిచేయడం సంతోషంగా ఉందన్నారు. మంచి కథా చిత్రాలను ఆదరించే తమిళ ప్రేక్షకులు తమ చిత్రాన్ని ఆదరిస్తారని నమ్ముతున్నట్లు పేర్కొన్నారు. ఈ చిత్రానికి కె.రామ్‌చరణ్ చాయాగ్రహణం అందిస్తున్నారు.
మొదట్లో
చాలా
భయపడ్డా!


