వరద బాధితులను ఆదుకోవాలి
వేలూరు: వేలూరు కార్పొరేషన్‌లోని వరద బాధిత ప్రాంతాలను గుర్తించి వారిని ఆదుకునేందుకు పారిశ్రామిక వేత్తలు, దాతలు ముందుకు రావాలని బీజేపీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కార్తియాయిని అన్నారు. వేలూరు కార్పొరేషన్‌లోని కన్సాల్‌పేట పూర్తిగా నీటితో నిండిపోవడంతో అక్కడి బాధితులను పాత బైపాస్ రోడ్డులోని సహాయ శిబిరంలో ఉంచారు. దీంతో బీజేపీ పార్టీ ఎస్సీ, ఎస్టీ విభాగం పార్టీ జిల్లా అధ్యక్షుడు ఏకే శరవణకుమార్ ఆధ్వర్యంలో బాధితులకు నిత్యావసర వస్తువులతోపాటు దుస్తులు, ఆహార పదార్థాలు, వంటి సంక్షేమ పథకాలు పంపిణీ చేశారు. ఇందులో హాజరైన ఆమె బాధితులను తమ వంతు ఆదుకుంటామన్నారు. ఇదే తరహాలోనే అన్ని ప్రాంతాల్లోని శిబిరాలను ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం బాధితులను పరామర్శించడంతోపాటు వారికి పలు వస్తు సామగ్రిని అందజేశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు దశరథన్, రాష్ట్ర కార్యనిర్వాహక సభ్యుడు కలైమగల్ ఇళంగోవన్, రోటరీ క్లబ్ కార్యదర్శి ప్రవీణ్, జిల్లా ఉపాధ్యక్షులు చక్రవర్తి, రమేష్ పాండియన్, ఐటీ విభాగం ఇన్‌చార్జ్ నందకుమార్, విఘ్నేష్ పాల్గొన్నారు.


