5 టన్నుల పుష్పాలతో షణ్ముఖర్‌కు పుష్పాంజలి
తిరుత్తణి: స్కంధషష్టి వేడుకల్లో ప్రధానమైన పుష్పాంజలి సోమవారం సాయంత్రం కనులపండువగా సాగింది. భారీ సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామి దర్శనం చేసుకున్నారు. తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో 22న స్కంధషష్టి వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ వేడుకల్లో ఆరవ రోజైన సోమవారం పుష్పాలతో షణ్ముఖర్‌కు పుష్పార్చన నిర్వహించారు. ఈ సందర్భంగా బెంగళూరు, హోసూరు సహా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పుష్పాలు తీసుకొచ్చారు. అలాగే తిరుత్తణి పట్టణ పుష్పాల వ్యాపారులు సైతం స్వామి సేవకు పుష్పాలు అందజేశారు. స్థానిక సుందర వినాయకుడి ఆలయం నుంచి మంగళ వాయిద్యాల నడుమ పుష్పాలను భక్తులు కొండ ఆలయంకు తరలించారు. సాయంత్రం 5 గంటటల సమయంలో సర్వాంగసుందరంగా అలంకరించిన షణ్ముఖర్‌కు అశేష భక్తజనం నడుమ దాదాపు 5 టన్నుల పుష్పాలతో స్వామికి పుష్పార్చన నిర్వహించి మహాదీపారాధన చేశారు. ఈ సందర్భంగా భక్తులు హరోంహర నామస్మరణతో స్వామిని దర్శించుకున్నారు. స్వామికి అర్చన చేపట్టిన పుష్పాలను భక్తులు పోటాపోటీగా తీసుకెళ్లారు.
5 టన్నుల పుష్పాలతో షణ్ముఖర్‌కు పుష్పాంజలి


