పవిష్ హీరోగా నూతన చిత్రం ప్రారంభం
తమిళసినిమా: నటుడు ధనుష్ దర్శకత్వం వహించిన నిలవుక్కు ఎన్ మేల్ ఎన్నడీ కోపం చిత్రం ద్వారా కథానాయకుడిగా పరిచయం అయిన నటుడు పవిష్. ఈయన దనుష్ సోదరి కొడుకు కావడం గమనార్హం. ఈయన గత ఆరు నెలలుగా పలు కథలు వింటూ వర్చారని, చివరికి మహేశ్ రాజేంద్రన్ చెప్పిన కథ నచ్చడంతో ఆయన దర్శకత్వంలో నటించడానికి అంగీకరించినట్లు ఆయన వర్గం పేర్కొన్నారు. కాగా మహేశ్ రాజేంద్రన్ ఇంతకు ముందు దర్శకుడు లక్ష్మణన్ వద్ద బోగన్, బూమి చిత్రాలకు సహాయదర్శకుడిగా పని చేశారన్నది గమనార్హం. కాగా పవిష్ కథానాయకుడిగా నటిస్తున్న రెండవ చిత్రం సోమవారం చైన్నెలో పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. జీ సినిమా మీడియా అండ్ ఎంటర్‌టెయిన్‌మెంట్ అధినేత దినేశ్‌రాజ్, క్రియేటివ్ ఎంటర్‌టెయినర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ అధినేత డి.ధనుంజయన్ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రంలో నటి నాగదుర్గ ఈ చిత్రం ద్వారా కథానాయకిగా పరిచయం అవుతున్నారు. ఈ తెలుగింటి ఆడపడుచు యూట్యూబ్‌లో పాపులర్ అయ్యారు. పీజీ.ముత్తయ్య ఛాయాగ్రణం అందిస్తున్న ఈ చిత్రం ద్వారా థింక్ మ్యూజిక్ సిఫార్సుతో నూతన సంగీత దర్శకుడు పరిచయం కానున్నారని, ఆయన గురించిన వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు చిత్ర వర్గాలు పేర్కొన్నారు. కాగా రొమాంటిక్ లవ్ కథాంఽశంతో రూపొందుతున్న ఈ చిత్ర పూజా కార్యక్రమాలకు నటుడు ధనుష్ తండి దర్శకుడు కస్తూరి రాజా ముఖ్య అతిథిగా పాల్గొని యూనిట్‌కు శుభాకాంక్షలు అందించారు. చిత్ర షూటింగ్‌ను 2026 ఆరంభంలో పూర్తి చేసి సమ్మర్ స్పెషల్‌గా విడుదల చేయడానికి ప్రణాళికను రచించినట్లు నిర్మాతలు పేర్కొన్నారు. చిత్రం ఈ తరం యువతతో పాటూ కుటుంబ సమేతంగా చూసి ఆనందించే విధంగా ఉంటుందని దర్శకుడు తెలిపారు.


