మాధవన్
మరో బయోపిక్‌లో
తమిళసినిమా: బయోపిక్‌లు తెరకెక్కడం కొత్తేమీ కాదు. అయితే అన్ని బయోపిక్‌లో ప్రేక్షకారణ పొందడం లేదు. ఇంతకు ముందు మహాత్మాగాంధీ, ఇందిరాగాంధీ, క్రికెట్ క్రీడాకారుడు ఎంఎస్.ధోని, తమిళంలో కామరాజ్, జయలలిత తదితరుల జీవిత చరిత్రలు సినిమాగా తెరకెక్కాయి. అయితే వాటిలో కొన్ని చిత్రాలు మాత్రమే విజయం సాధించాయి. కాగా ఇంతకు ముందు ప్రఖ్యాత ఇస్రో శాస్త్రవేత్త అంబి నారాయణన్ బయోపిక్‌ను రాకెట్రీ ది అంబి ఎఫెక్ట్ పేరుతో తెరకెక్కిన విషయం తెలిసిందే. ఈచిత్రంలో నటుడు మాధవన్ అంబి నారాయణన్ పాత్రను పోషించి, స్వీయ దర్శకత్వం వహించడం విశేషం. ఈ చిత్రం కమర్షియల్‌గా సక్సెస్ కావడంతో పాటూ విమర్శకుల ప్రశంసలను అందుకుని, జాతీయ స్థాయిలో అవార్డులను గెలుచుకుంది. కాగా తాజాగా నటుడు మాధవన్ మరో బయోపిక్‌లో నటిస్తున్నారు. ఇండియన్ ఎడిసన్‌గా పేరు గాంచిన జీడీ నాయుడు జీవిత చరిత్రను జీడీఎన్ పేరుతో సినిమాగా తెరకెక్కుతోంది. ఈయన కోయంబత్తూర్‌కు చెందిన ప్రముఖుడు అన్నది గమనార్హం. పలు విషయాలను కనుగొని ఇండియన్ ఎడిసన్‌గా పేరుగాంచారు. ఈ చిత్రంలో జీడీ నాయుడుగా నటుడు మాధవన్ నటిస్తున్నారు. నటుడు సత్యరాజ్, జయరామ్, తంబిరామయ్య, నటి ప్రియమణి, దుషారా విజయన్, వినయ్‌రాయ్ తదితరులు ముఖ్య పాత్రలను పోషిస్తున్న వర్గీస్ మూలన్స్ పిక్చర్స్ సంస్థతో కలిసి నటుడు మాధవన్‌కు చెందిన త్రికలర్ ఫిలింస్ సంస్థ నిర్మిస్తోంది. కథ, దర్శకత్వం బాధ్యతలను కృష్ణకుమార్ రామకుమార్ నిర్వహిస్తున్నారు. గోవింద వసంత్ సంగీతాన్ని, అరవింద్.కె ఛాయాగ్రహణం అందిస్తున్న ఈ చిత్రం షూటింగ్ జీడీ నాయుడు స్వగ్రామం అయిన కోయంబత్తూర్‌లో శరవేగంగా జరుపుకుంటోంది. కాగా జీడీ నాయుడు చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను ఆదివారం నటుడు మాధవన్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేశారు. ఈ పోస్టర్ ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తోంది. కారణం అందులో నటుడు మాధవన్ గుర్తుపట్టలేనంతగా జీడీ. నాయుడి గెటప్‌లో ఉండడమే. చిత్రాన్ని 2026లో సమ్మర్ స్పెషల్‌గా విడుదల చేయనున్నట్లు నిర్మాతల వర్గం పేర్కొన్నారు.
మాధవన్


