వీజే సిద్దూ స్వీయ దర్శకత్వంలో..
తమిళసినిమా: వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై ఐసరి కె.గణేశ్ తాజాగా నిర్మిస్తున్న చిత్రం డయంకరం. డిజిటల్ స్టార్‌గా పేరు గాంచిన వీజే.సిద్ధూ ఈ చిత్రం ద్వారా కథానాయకుడిగా, దర్శకుడిగా పరిచయం కావడం విశేషం. ఈయన ఇంతకు ముందు డ్రాగన్ చిత్రంలో ముఖ్య పాత్రను పోషించి, మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. కాగా డయంకరం చిత్రం ద్వారా హీరోగా, దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. నట్టి, కాళీ వెంకట్, ఇళవరసు, నితిన్‌సత్య, హర్షద్ కాంత్, ఆదిత్య కధీర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించనున్నారు. పి.దినేశ్ కృష్ణన్ ఛాయాగ్రహణం, సిద్ధుకుమార్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం పూజా కార్యక్రమాలను సోమవారం ఉదయం స్థానిక నుంగంభాక్కంలోని ఎల్‌ఏ స్టూడియోలో ప్రారంభించారు. చిత్ర వివరాలను యూనిట్ వర్గాలు తెలుపుతూ ఇది కామెడీ ఎంటర్‌టెయిన్‌గా ఉంటుందన్నారు. నేటి యువత మనోభావాలు, ఏమోషనల్‌తో కూడిన హ్యూమర్ కలగలిపి అన్ని వర్గాలను అలరించే విధంగా డయంకరం చిత్రం ఉంటుందని పేర్కొన్నారు. చిత్ర ఆడియోను వేల్స్ మ్యూజిక్ ఇంటన్నేషనల్ సంస్థ ద్వారా విడుదల చేయనున్నట్లు చెప్పారు. అదే విధంగా ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు పేర్కొన్నారు. కాగా ఈ చిత్ర పూజా కార్యక్రమాల్లో పలువురు సినీ ప్రముఖులు పాల్గొని యూనిట్ సభ్యులకు శుభాకాంక్షలు అందించారు.


