క్యూబిక్‌లో మరో రికార్డు నెలకొల్పిన చైన్నె బాలుడు
కొరుక్కుపేట: చైన్నెకు చెందిన ఓ 15 ఏళ్ల బాలుడు క్యూబిక్‌లో రికార్డుల మోత మోగిస్తున్నాడు .కేవలం 15 ఏళ్ల వయస్సులోనే తన అసాధారణ ప్రతిభతో 15 జాతీయ ,అంతర్జాతీయ రికార్డులను సాధించిన అందరి మన్ననలు పొందుతున్నాడు. గవర్నర్ ఆర్ ఎన్ రవి,రాష్ట్ర పాఠశాల విద్యాశాఖామంత్రి అన్బిల్ మహేష్‌ల నుంచి ప్రసంశలు అందుకున్నాడు. చైన్నెలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న పి.సిద్ధార్థ్ క్యూబిక్‌లో మరో రికార్డు సృష్టించాడు. తమిళనాడు క్యూబ్ అసోసియన్, ఆలిండియా స్పోర్ట్స్ అండ్ రిక్రియేషనల్ యాక్టివిటీస్ క్లబ్ (ఏఐఎస్‌ఆర్‌ఎసీ) సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో సిద్ధార్థ్ ఓ వైపు తిరుక్కురల్ ను పఠిస్తూ, ఎడమ చేతితో రూబిక్స్ క్యూబ్‌లను చేస్తూ, కుడి చేతితో ‘సీతాకోకచిలుకలా దువ్వెన తిప్పుతూ నిమిషం14 సెకన్లలో క్యూబ్‌లను సాల్వ్ చేసి అరుదైన రికార్డును సాధించారు. ఈ సాధన ఇంజీనియస్ చార్మ్ వరల్డ్ రికార్‌ుడ్స, ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌తోపాటు ఇంటర్నేషనల్ అచీవర్స్ రికార్డ్స్ నమోదయ్యాయి . ఈ సందర్భంగా ఏఐఎస్‌ఆర్‌ఏసి ప్రెసిడెంట్ ఆనంద్ రాజేంద్రన్ చేతుల మీదుగా క్యూబ్ గ్రాండ్‌మాస్టర్ పి. సిద్ధార్థ్‌కు సర్టిఫికెట్ అందించి ఘనంగా సత్కరించారు.


