వేలూరు: మహిళలు స్వయం ఉపాధితో అభివృద్ధి చెందాలని వేలూరు వీఐటీ ఉపాధ్యక్షుడు జీవీ సెల్వం అన్నారు. ఆయన జన్మదినోత్సవాన్ని పురష్కరించుకొని పేద మహిళలకు కుట్టు మిషన్‌లు, సంక్షేమ పథకాలు, మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఆదివారం ఉదయం ఆయన జన్మదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ పేదలను ఆదుకోవడానికి పారిశ్రామిక వేత్తలు మందుకు రావాలన్నారు. వేలూరును ఆదర్శ జిల్లాగా చేసేందుకు ప్రతిఒక్కరూ కంకణం కట్టుకోవాలన్నారు. దీంతోనే తాను వేలూరు జిల్లాలోని అన్ని విభాగాలకు చెందిన కార్మికులు, నిరుపేద మహిళలకు సంక్షేమ పథకాలు అందజేస్తున్నట్లు తెలిపారు. జీవీఎస్ బృందం సభ్యులు గణేష్, వినోద్, పుణ్యకోటి, హేమావతి, న్యాయవాది పీడీకే మారన్, శ్రీనివాసన్, భూమినాదన్, సతీష్‌కుమార్, సుందర్ పాల్గొన్నారు.


