కనులపండువగా మహాకుంభాభిషేకం
వేలూరు: వేలూరు కార్పొరేషన్ పరిధిలోని కస్పా ప్రాంతంలో శ్రీ స్వర్ణపురేశ్వరాలయంలో మహాకుంభాభిషేకం ఆదివారం కనులపండువగా జరిగింది. వేద పండితుల మంత్రాల నడుమ రెండవ కాల యాగశాల పూజలు, వేద గీత సమర్పణం, మహాకుంభాభిషేకం అతి వైభవంగా జరిగింది. ముందుగా కలశాలను యాగ గుండంలో ఉంచి ప్రత్యేక పూజలు చేసి కలస నీటిని ఆలయ రాజగోపురంపైకి తీసుకెళ్లారు. వేద మంత్రాల నడుమ ఆలయ గోపురంపై చల్లారు. అనంతరం కలశ నీటిని భక్తులపై చల్లడంతో కుంభాభిషేకం పూర్తి చేశారు. అనంతరం ఆలయంలోని స్వామి వారికి దీపారాధన పూజలు చేసి భక్తులకు దర్శనం భాగ్యం కల్పించారు. అనంతరం భక్తులకు కలశాలను ప్రసాదంగా అందజేయడంతో పాటు మధ్యాహ్నం భక్తులకు అన్నదానం చేశారు.


