వైద్య చికిత్సకు ఆర్థికసాయం
తిరుత్తణి: అనారోగ్యంతో బాధపడుతున్న ఓ మహిళకు వైద్య చికిత్స కోసం ఆర్థికసాయం అందజేశారు. ఆర్కే పేట యూనియన్ వెడియంగాడు గ్రామానికి చెందిన దీప అనారోగ్యంతో బాధపడుతోంది. పేద కుటుంబం కావడంతో వైద్య చికిత్స ఖర్చులకు ఆర్థికసాయం చేయాలని డీఎంకే యువజన విభాగ ట్రస్టుకు విన్నవించింది. స్పందించిన యువజన విభాగం కన్వీనర్, ఉపముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ రూ.25వేలు ట్రస్టు ద్వారా విడుదల చేశారు. ఈ మొత్తం చెక్కు రూ పంలో దీపకు జిల్లా మంత్రి నాజర్, తిరుత్తణి ఎమ్మె ల్యే చంద్రన్ పంపిణీ చేశారు. జిల్లా యువజన విభాగ కన్వీనర్ కిరణ్, ఉపకార్యదర్శి రాజా పాల్గొన్నారు.


