రూ. 27 కోట్ల వ్యయంతో..
తిరువళ్లూరు: పళవేర్కాడు ముఖద్వారం వద్ద సుమారు రూ. 27 కోట్లు వ్యయంతో చేస్తున్న పనులను రాష్ట్ర మంత్రి నాజర్, కలెక్టర్ ప్రతాప్, మానిటరింగ్ అధికారి కార్తికేయన్ తదితరులు బోటులో వెళ్లి పపనులను పరిశీలించారు. వివరాలు.. తిరువళ్లూరు జిల్లా పళవేర్కాడులోని ముఖ ద్వారం వద్ద పేరుకపోయిన ఇసుక దిబ్బల కారణంగా నీరు సముద్రంలోకి ప్రవేశించడం కష్టంగా మారింది. దీంతో పళవేర్కాడు తదితర ప్రాంతాలకు ముంపు ఏర్పడుతోంది. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం శాశ్వ త నివారణ పనుల కోసం రూ.27 కోట్లు రూపాయల ను కేటాయించి గత ఆరు నెలల క్రితం పనులను ప్రారంబించారు. ముఖద్వారం వద్ద పేరుకపోయిన ఇసుక దిబ్బలను తొలగించడంతో పాటూ నీరు ఎలాంటి ఆటంకం లేకుండా ప్రవహించడానికి కొన్ని నిర్మాణాలను చేపట్టింది. ఈ పనులను రాష్ట్ర మైనారీటి సంక్షేమశాఖ మంత్రి నాజర్, తిరువళ్లూరు కలెక్టర్ ప్రతాప్, సీనియర్ ఐఏఎస్ ఽఅధికారి జిల్లా మానిటరింగ్ ఽఅధి కారి కార్తికేయన్ సుమారు 10 కి.మీ బోటులో ప్రయాణించి శనివారం రాత్రి పనులను పరిశీలించారు. పనులను త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు.


