గబ్బిలం ఓ అపూర్వ సృష్టి
కొరుక్కుపేట: నవయుగ కవి చక్రవర్తి జాషువా రచనల్లో శ్రీగబ్బిలంశ్రీ ఒక అపూర్వ సృష్టి అని నెల్లూరుకి చెందిన ఆధ్యాత్మిక సాహిత్య ఉపన్యాసకులు బొగ్గరపు రాధాకృష్ణమూర్తి కొనియాడారు. వేద విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ప్రతీనెలా నిర్వహించేతరతరాల తెలుగు కవిత ఉపన్యాస ధారావాహిక 166వ ప్రసంగంగా విశ్వనరుడు – గుర్రం జాషువా అనే అంశంపై జరిగింది. ఆదివారం రాత్రి జరిగిన ఈ కార్యక్రమానికి చైన్నె టి.నగర్‌లోని ఆస్కా ప్రాంగణంలోని కృష్ణా హాల్ వేదికై ంది. కార్యక్రమానికి వక్తగా ఆధ్యాత్మిక సాహిత్య ఉపన్యాసకులు బొగ్గరపు రాధాకష్ణమూర్తి పాల్గొని ప్రసంగించారు. వక్తను నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. పెద్దసంఖ్యలో సాహితీప్రియులు పాల్గొన్నారు.


