దొంగ ఓట్ల నిర్మూలనే లక్ష్యం
పళ్లిపట్టు: దొంగ ఓట్ల నిర్మూలనే లక్ష్యంగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో పొదటూరుపేటలో ఆదివారం సంతకాల ఉద్యమం నిర్వహించారు. పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు రమేష్ అధ్యక్షతన నిర్వహించిన సంతకాల ఉద్యమంలో ఆ పార్టీ నేత విభాగం రాష్ట్ర అధ్యక్షుడు సుందరవేలు, న్యాయవాదుల విభాగం రాష్ట్ర కార్యదర్శి మురుగన్ పాల్గొని సంతకాల ఉద్యమం ప్రారంభించారు. కేంద్ర ఎన్నికల సంఘంను బీజేపీ తన కనుసన్నలో వుంచుకుని దొంగ ఓటర్లు చేర్పించి పాక్షికంగా విజయానికి కుట్రపన్ని ఎన్నికల కమిషన్ అండదండలతో విజయం సాధిస్తున్నట్లు, ప్రజాస్వామ్య దేశంలో ప్రజల ఓటు ద్వారా మాత్రమే గెలుపోటములు నిర్ణయించాలని, దొంగఓట్లు చేర్పించడం ఎదుర్కొనేందుకు ప్రతిఒక్కరూ ముందుకురావాలని కోరుతూ సంతకాల ఉద్యమం నిర్వహించారు. ఇందులో అనేక మంది పాల్గొని తమ మద్దతు తెలిపారు.


