రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన ర్యాలీ
తిరువళ్లూరు: రొమ్మ క్యాన్సర్‌పై అవగాహన అవసరమని తిరువళ్లూరు ప్రభుత్వ మెడికల్‌కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రేవితి సూచించారు. ఏటా అక్టోబర్ 25న రొమ్ము క్యాన్సర్ దినోత్సవాన్ని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా శనివారం తిరువళ్లూరు మెడికల్ కళాశాల వద్ద అవగాహన ర్యాలీ జరిగింది. ర్యాలీని మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రేవతి అద్యక్షత వహించి ర్యాలీని ప్రారంభించారు. ర్యాలీలో ఆంకాలజీ సర్జరీ విభాగం ప్రొఫెసర్‌లు అఖిల, మధుసూధనన్‌తోపాటూ పలువురు పాల్గొన్నారు. ర్యాలీలో రొమ్ము క్యాన్సర్‌కు చిక్సిత, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంతో పాటూ ఇతర అంశాలపై నినాదాలు చేశారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్ సురేష్‌బాబు, డిప్యూటీ సూపరిండెంట్ డాక్టర్ విజయరాజ్, ఆర్‌ఎంవో డాక్టర్ రాజ్‌కుమార్, ఏఆర్‌ఎంవో ప్రభుశంకర్, డాక్టర్‌లు జగదీష్‌తో పాటూ పలువురు మెడికల్ విద్యార్థులు, ట్రైనీడాక్టర్‌లు, నర్సింగ్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.


