శిరువాపురిలో సూరసంహారం
తిరువళ్లూరు: స్కంధషష్టి ఉత్సవాల్లో భాగంగా శిరువాపురి మురుగన్ ఆలయంలో సోమవారం జరిగిన సూరసంహారం కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు. తిరువళ్లూరు జిల్లా చోళవరం యూనియన్‌లో చిన్నంబేడు శిరువాపురి గ్రామంలో ప్రసిద్ధి చెందిన శ్రీబాలసుబ్రమణ్యం ఆలయం ఉంది. ఆలయంలో ప్రతి ఏటా స్కంధషష్టి ఉత్సవాలను ఏడు రోజులపాటు ఘనంగా నిర్వహించడం ఆవవాయితీ. ఉత్సవాల్లో భాగంగా ఆరో రోజు సోమవారం ఉదయం పుష్పాలంకరణ నిర్వహించారు. అనంతరం 9వ కాలపూజలు, ప్రాకార ఊరేగింపు, కలఽశపూజలు, పూర్ణాహుతి నిర్వహించారు. అనంతరం సాయంత్రం జోరువానలోనూ శూరసంహారం నిర్వహించారు. సూరసంహారం కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు హాజరయ్యారు. మంగళవారం ఉదయం అభిషేకం, చందనకాపు ఉత్సవం, సాయంత్రం స్వామివారికి తిరుకల్యాణం, రాత్రి ఎనిమది గంటలకు స్వామి వారి ఊరేగింపు నిర్వహించనున్నట్టు అధికారులు తెలిపారు.
శిరువాపురిలో సూరసంహారం


