పురాతన ఆలయంలో స్కంధషష్టి | - | Sakshi
Sakshi News home page

పురాతన ఆలయంలో స్కంధషష్టి

Oct 28 2025 8:46 AM | Updated on Oct 28 2025 8:46 AM

పురాత

పురాతన ఆలయంలో స్కంధషష్టి

కొరుక్కుపేట: చైన్నె జార్జిటౌన్‌లోని 300 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన శ్రీ కన్యకాపరమేశ్వరి ఆలయంలో స్కంధ షష్టి మహోత్సవం వైభవోపేతంగా సాగుతోంది. అందులో భాగంగా ఆరోరోజు సోమవారం సూరసంహార కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. వర్షం కారణంగా ఆలయ మహామండపంలో ఈ సూరసంహార వేడుకలను చేపట్టారు. ఆలయ అర్చకులు భాస్కర పంతులు బృందం శ్రీసుబ్రమణ్యస్వామిని నెమిలి వాహనంపై వేంచేపు చేసి వివిధ రకాల పుష్పాలతో విశేషంగా అలంకరించి పూజలు చేశారు. వందలాది మంది భక్తులు ఈ వేడుకల్లో పాల్గొని శ్రీసుబ్రమణ్యస్వామి కృపకు పాత్రులయ్యారు. ఆలయ పాలకమండలి సభ్యులు భక్తులకు తగిన ఏర్పాటు చేసి ప్రసాద వినియోగం చేశారు.

పురాతన ఆలయంలో స్కంధషష్టి1
1/1

పురాతన ఆలయంలో స్కంధషష్టి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement