బైక్‌ను ఢీకొన్న బస్సు
యువకుడి మృతి
తిరుత్తణి: బైకును బస్సు ఢీకొని యువకుడు ప్రాణాలు కోల్పోయిన ఘటన శోకాన్ని మిగిల్చింది. తిరువలంగాడు యూనియన్‌లోని నల్లాటూరు గ్రామానికి చెందిన సురేష్‌బాబు కుమారుడు కీర్తివాసన్(25) శ్రీపెరంబదూరులోని ప్రయివేటు కర్మాగారంలో విధులు నిర్వహించేవారు. యథాప్రకారం శనివారం బైకులో పనికి వెళ్లి రాత్రి 9 గంటల సమయంలో ఇంటికి తిరుగు పయనమయ్యారు. చైన్నె తిరుపతి జాతీయ రహదారిలోని కనకమ్మసత్రం వద్ద ముందుగా వెళ్తున్న బైకును వెనుక వైపు వచ్చిన ప్రభుత్వ బస్సు వేగంగా ఢీకొంది. ప్రమాదంలో కీర్తివాసన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అక్కడున్న వారు కాపాడి తిరువళ్లూరు ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. అయితే అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రమాదంపై కనకమ్మసత్రం పోలీసులు కేసు నమోదు చేసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.


