తిరువాభవరణం అలంకరణలో సుబ్రహ్మణ్యస్వామి
తిరుత్తణి: స్కంధషష్టి ఉత్సవాల్లో భాగంగా నాల్గవ రోజైన శనివారం మూలవిరాట్‌కు తిరువాభరణం అలంకరణలో దర్శనమిచ్చారు. తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో స్కంధషష్టి వేడుకలు వైభవంగా నిర్వహిస్తున్నారు. వేడుకల్లో నాల్గవ రోజైన శనివారం వేకువజామున మూలవర్లకు అభిషేక ఆరాధన పూజలు నిర్వహించి తిరువాభరణ అలంకరణలో దీపారాధన నిర్వహించారు. ఉదయం 9 గంటలకు కావడి మండపంలో శ్రీవళ్లిదేవసేన సమేత ఉత్సవర్లు షణ్ముఖర్‌కు సుగంధ పుషపాలతో సర్వాంగసుందరంగా అలంకరించి బిల్వాకులతో లక్షార్చన చేశారు. ఇందులో భక్తులు రూ.250 చెల్లించి లక్షార్చనలో పాల్గొని స్వామి దర్శనం చేసుకున్నారు. స్కంధషష్టి సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో షష్టి దీక్ష చేసి ఆలయానికి చేరుకుని స్వామి దర్శనం చేశారు.
షణ్ముఖర్‌కు లక్షార్చన, లక్షార్చనలో భక్తులు
తిరువాభవరణం అలంకరణలో సుబ్రహ్మణ్యస్వామి


