‘మోంథా’ జాగ్రత్తలు సిద్ధం | - | Sakshi
Sakshi News home page

‘మోంథా’ జాగ్రత్తలు సిద్ధం

Oct 28 2025 7:52 AM | Updated on Oct 28 2025 7:52 AM

‘మోంథ

‘మోంథా’ జాగ్రత్తలు సిద్ధం

ఎంత భారీ వర్షం కురిసినాఎదుర్కొనేందుకు రెడీ

డీప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌ స్పష్టీకరణ

సాక్షి, చైన్నె: మోంథా తుపాన్‌తో రాష్ట్రంలోని అన్ని హార్బర్‌లలో ప్రమాద సూచికలను ఎగురవేశారు. అధికార యంత్రాంగం ముందు జాగ్రత్తలు సిద్ధం చేశారు. ఎంతపెద్ద వాన వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌ ధీమా వ్యక్తంచేశారు. ఈశాన్య రుతు పవనాలతో నేపథ్యంలో బంగాళాఖాతంలో మోంథా తుపాన్‌ ఉత్తర తమిళనాడులో పూర్తిగా వాతావరణాన్ని మార్చేసింది. విల్లుపురం, చెంగల్పట్టు, కాంచీపురం, చైన్నె, రాణిపేట, వేలూరు, తిరువళ్లూరు జిల్లాలో సోమవారం ఉదయం నుంచి చిరు జల్లులతో వర్షం పడుతూ వచ్చింది. మోంథా ఆంధప్రదేశలోని కాకినాడలో తీరాన్ని మంగళవారం దాటుతున్నప్పటికీ, ఇది చైన్నెకు సమీపంలో ప్రయాణించే అవకాశాలు ఉన్నట్టు అంచనా వేశారు. దీంతో చెంగల్పట్టు, కాంచీపురం, చైన్నె, తిరువళ్లూరు తదితర జిల్లాలలోని అధికార యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. అధిక ప్రభావం తిరువళ్లూరు జిల్లాపై ఉండేందుకు అవకాశాల నేపథ్యంలో ప్రత్యేక దృష్టి పెట్టారు. సోమవారం రాత్రి సమయానికి చైన్నెకు 450 కి.మీ దూరంలో మోంథా కేంద్రీకృతమై, గంటకు సమారు 18 కి.మీ వేగంతో ప్రయాణిస్తున్నట్టు వాతావరణ అధికారులు ప్రకటించారు. ఈ ప్రభావంతోభారీ వర్షం పడ్డ పక్షంలో ముంపుప్రాంతాలలో బాధితులను ఆదుకునేందుకు ముందు జాగ్రత్తలు చైన్నె, శివారులలో సిద్ధం చేశారు.

సిద్ధంగా ఉన్నాం..

ఉదయం నుంచి అధికారులు, డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌, మంత్రులు ఎం. సుబ్రమణియన్‌, కేఎన్‌ నెహ్రు, శేఖర్‌బాబు, మేయర్‌ ప్రియ తదితరులు వేర్వేరుగా చైన్నెలో ఉరకలు పరుగులతో ముందు జాగ్రత్తలను పరిశీలించారు. వ్యాసార్పాడి, తండయార్‌ పేట పరిసరాలలో డిప్యూటీ సీఎం పరిశీలన జరిపారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ మోంథా తుపాన్‌ తమిళనాడుపై పెద్ద ప్రభావం ఉండదని భావించినా, ముందు జాగ్త్రతలు విస్తృతం చేసి ఉంచామన్నారు. ఉత్తర చైన్నె, తిరువళ్లూరులలో 8 సెం.మీ మేరకు వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం సూచనతో అందరం సమష్టిగా ప్రజలకు సేవలు అందించేందుకు సిద్ధమై ఉన్నామన్నారు. ఎంతపెద్ద వాన వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఇదిలా ఉండగా వర్షాల సీజన్‌ నేపథ్యంలో రవాణా సంస్థ ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. డ్రైవర్లు బస్సులను జాగ్రత్తగా నడపాలని, ప్రయాణీకుల భద్రతకు భరోసాకల్పించాలని సూచించారు. సురక్షిత ప్రయాణం దిశగా వర్షాల సమయంలో బస్సులను నడపాలని, ఎక్కడైనా రోడ్లపై అధిక నీరు ప్రవహిస్తున్నట్టు గుర్తిస్తే, తక్షణం సమాచారాలు ఇవ్వాలని, ప్రయాణికులకు పూర్తిస్థాయి భద్రత కల్పించేందుకు డ్రైవర్లు సిద్ధమై ముందడుగు వేయాలని సూచించారు. ఇక వర్షాల నేపథ్యంలో చైన్నెలో 405 శాశ్వత వైద్య శిబిరాలు, 166 మొబైల్‌ వైద్య శిబిరాల ద్వారా వైద్య సేవల విస్తృతానికి సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఆహారం, వైద్యం, తాగునీటి సౌకర్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. కాగా, రెవెన్యూశాఖ మంత్రి కేకేఎస్‌ఎస్‌ఆర్‌ రామచంద్రన్‌, ఇతర అధికారులు ఎళిలగంలోనిస్టేట్‌ కంట్రోల్‌రూమ్‌కు పరిమితమయ్యారు. మోంథా కదలికను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, వర్ష ప్రభావం ఎక్కడెక్కడ ఎక్కువగా ఉంటుందో ముందే గ్రహించి విస్తృత చర్యలు చేపట్టే పనిలో నిమగ్నమయ్యారు.

కూలిన చెట్టు తొలగింపు

‘మోంథా’ జాగ్రత్తలు సిద్ధం1
1/5

‘మోంథా’ జాగ్రత్తలు సిద్ధం

‘మోంథా’ జాగ్రత్తలు సిద్ధం2
2/5

‘మోంథా’ జాగ్రత్తలు సిద్ధం

‘మోంథా’ జాగ్రత్తలు సిద్ధం3
3/5

‘మోంథా’ జాగ్రత్తలు సిద్ధం

‘మోంథా’ జాగ్రత్తలు సిద్ధం4
4/5

‘మోంథా’ జాగ్రత్తలు సిద్ధం

‘మోంథా’ జాగ్రత్తలు సిద్ధం5
5/5

‘మోంథా’ జాగ్రత్తలు సిద్ధం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement