అలరించిన సురంజనా బోస్ సంగీత విభావరి
కొరుక్కుపేట:.శాసీ్త్రయ సంగీత కళలను పరిపోషిస్తున్న విశ్వకళా సంగమ ఆధ్వర్యంలో కలకత్తాకు చెందిన విధూషి సురంజనా బోస్ హిందుస్తానీ సంగీత విభావరితో అలరించింది. చైన్నె తిరువాన్మయూర్‌లోని కళా క్షేత్ర కళాశాల ప్రాంగణంలోని ఠాగూర్ హాల్ వేదికగా ఆదివారం రాత్రి హిందుస్తానీ సంగీత కచ్చేరి ఏర్పాటు చేశారు. విదూషి సురంజనా బోస్ దాదాపు 2 గంటల పాటూ హిందుస్తానీ కచేరితో సంగీత ప్రియులను మంత్రముగ్దులను చేశారు. ఆమె ఇంకా రాగశ్రీ రాగంలో సజ్ రంగ్ అనే పాట, పీలూతుమ్రీ, మాండ్ రాగంలో భజనల్లోని ప్రత్యేకమైన గీతాలు ఆలపించి శ్రోతలను పరవశింపజేశారు. ఆమెకు వాయిద్య సహకారాన్ని హార్మోనియంపై సందీప్ గుర్ములే, తబలాపై రామ్ ఖాద్సే అందించారు. ఈ సందర్భంగా కళాకారులను విశ్వకళా సంగమ వ్యవస్థాపకులు ఊరా లక్ష్మీ నరసింహారావు శాలువాలతో సత్కరించి అభినందించారు. ఆనంతరం ఆయన మాట్లాడుతూ విశ్వకళా సంగమ గత 25 సంవత్సరాలుగా హిందుస్తానీ సంగీతానికి పెద్దపీట వేస్తుందన్నారు. నార్త్ ఇండియా నుంచి గొప్పగొప్ప కళాకారులను తీసుకుని వచ్చి హిందుస్తానీ కచేరిలతో సంగీత ప్రియులను మైమరిపింప జేస్తున్నట్టు తెలిపారు. విశ్వకళా సంగమ 26 వ వార్షిక సంగీతోత్సవాలు రానున్న డిసెంబర్ 19 నుంచి 21వ తేది వరకు మూడు రోజులుపాటూ చైన్నె ఆళ్వార్ పేటలోని నారథగాన సభ వేదికగా నిర్వహిస్తామన్నారు.
250 రోజులు పూర్తి చేసుకున్న నిత్యాన్నదానం
కొరుక్కుపేట: రాష్ట్ర ముఖ్య మంత్రి ఎం.కె. స్టాలిన్ 72వ పుట్టినరోజు సందర్భంగా 365 రోజలుపాటూ నిత్య అన్నదాన ప్రాజెక్టును దేవాదాయశాఖ మంత్రి పీకే శేఖర్ బాబు ప్రారంభించారు. ఫిబ్రవరి 19, 2026 వరకు, సంవత్సరంలో 365 రోజుల పాటూ వివిధ ప్రదేశాలలో రోజుకు సగటున 1000 మందికి అల్పాహారం అందించాలని ప్రణాళిక రచించారు. ఈ గొప్ప ప్రాజెక్టును మంత్రి పి.కె. శేఖర్‌బాబు నేతృత్వంలో ఈ ఏడాది ఫిబ్రవరి 20న ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ సతీమణి దుర్గా స్టాలిన్ చేతులమీదుగా కొళత్తూరులో ప్రారంభించారు. ఈ కార్యక్రమం సోమవారంతో 250వ రోజు విజయవంతంగా కొనసాగుతోంది. దీంతో కొలత్తూర్ వెస్ట్ ఏరియా, 64వ వార్డు కొలత్తూర్, ఎ.ఓ. కాలనీ 36వ కట్ రోడ్, లక్ష్మీ ఫార్మసీ దగ్గర , 64వ వార్డు, కొలత్తూర్ మెయిన్ రోడ్, టీచర్స్ గిల్డ్ రోడ్, మూకాంబిక అమ్మన్ ఆలయానికి సమీపంలోఏర్పాటు చేస్తున్నారు .ఈ కార్యక్రమానికి మంత్రి శివ మెయ్యనాథన్ ప్రత్యేక అతిథిగా హాజరై ప్రజలకు అల్పాహారం వడ్డించారు. ఈ అద్భుతమైన ప్రాజెక్టుకు ప్రజల నుండి మంచి ఆదరణ లభించింది.
అలరించిన సురంజనా బోస్ సంగీత విభావరి


