ఘనంగా నాగులచవితి వేడుకలు
తిరుత్తణి: నాగుల చవితి సందర్భంగా నాగాలమ్మ ఆలయాల్లో శనివారం సందడి నెలకొంది. దీపావళి ఐదు రోజుల తరువాత నాగుల చవితి నిర్వహించడం పరిపాటి. ఈ సందర్భంగా తిరుత్తణిలో నాగాలమ్మ ఆలయాల్లో మహిళలు పూజలు చేపట్టి నాగ దేవతను వేడుకున్నారు. నాగ దోషం వున్నవారు. నాగల చవితి సందర్భంగా అమ్మవారికి పూజలు చేసి దర్శించుకుంటే దోషాలు తొలగిపోతాయన్నది భక్తుల ప్రగాఢ విశ్వాసం. తిరుత్తణి గాంధీ రోడ్డులోని నాగలమ్మ ఆలయంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు మహిళలు రావిచెట్టుకు పసుకు కుంకుమ దిద్ది, పుట్టకు పూజలు చేసి కోడిగుడ్డు, పాలు పోసి దర్శించుకున్నారు. పెట్టపై సజ్జలు వెదజెల్లారు. ఇదే విధంగా పట్టణంలోని పలు ప్రాంతాల్లో పుట్టకు మహిళలు పూజలు చేపట్టి దర్శించుకున్నారు. పళ్లిపట్టు, పొదటూరుపేట, తిరువలంగాడు, కనకమ్మసత్రం, ఆర్కేపేట, కేజీ.కండ్రిగ పరిసర ప్రాంతాల్లో మహిళలు నాగుల చవితి పూజలు నిర్వహించారు.
తిరువళ్లూరులో..
తిరువళ్లూరు: నాగుల చవితిని పురస్కరించుకుని జిల్లావ్యాప్తంగా ప్రత్యేకంగా పూజలు నిర్వహించి ప్రజలు తమ మొక్కుబడులు చెల్లించుకున్నారు. ఏటా దీపావళీ ముగిసిన ఐదవ రోజు నాగుల చవితి వేడుకలను నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఈ నేపథ్యంలో శనివారం నాగుల చవితి కావడంతో ఉదయం నుంచే అమ్మవారి ఆలయాల వద్ద భక్తుల రధ్దీ కనిపించింది. నాగదేవతకు ప్రత్యేక పూజలు చేయడంతో పుట్టలో పాలు పోసి గుడ్డు పెట్టి మొక్కుబడులు చెల్లించుకున్నారు. తిరువళ్లూరులోని శివుడి ఆలయం, అంకాళపరమేశ్వరి అమ్మవారి ఆలయం, మూంగత్తమ్మన్‌తో పాటు పలు ఆలయాల్లో వున్న పాము పుట్టలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
భక్తిశ్రద్ధలతో నాగులచవితి వేడుకలు
కొరుక్కుపేట: రాష్ట్రవ్యాప్తంగా నాగులచవితి వేడుకలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మహిళలు ఆలయాలకు చేరుకొని నాగదేవతకు పూజలు చేసి పుట్టలో పాలుపోసి మొక్కులు తీర్చుకున్నారు. చైన్నె జార్జ్‌టౌన్‌లో శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో నాగుల చవితి వేడుకలు శనివారం కోలాహలంగా నిర్వహించారు. మహిళలు నాగదేవతకు ప్రత్యేక పూజలను నిర్వహించారు. చైన్నె ట్రిప్లికేన్ రామనగర్‌లోని నాగదేవత ఆలయంలో నాగులచవితి ఘనంగా చేశారు. మాతమ్మ ఆలయం నుంచి మహిళలు 108 పాలబిందెలతో ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని నాగదేవతకు అభిషేకం చేసి భక్తిభావాన్ని చాటుకున్నారు.
నాగాలమ్మ ఆలయంలో పుట్టకు పూజలు చేస్తున్న మహిళలు
నాగులచవితిని పురస్కరించుకుని ప్రత్యేక పూజల్లో భక్తులు
ఘనంగా నాగులచవితి వేడుకలు
ఘనంగా నాగులచవితి వేడుకలు


