కుశస్థలి పరవళ్లు
తిరుత్తణి: తిరువలంగాడు ప్రాంతంలో కుశస్థలి నది ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో నదికి మధ్యలోని రెండు కల్వర్టులను వరద ప్రవాహం ముంచెత్తడంతో గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. ఈశాన్య రుతుపవానాల ప్రభావంతో గత కొద్ది రోజులుగా తిరుత్తణి, తిరువలంగాడు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షంతో కుశస్థలి నదిలో వరద ప్రవాహం ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఈక్రమంలో పాలారులో వరద ప్రవాహం చోటుచేసుకుని తిరువలంగాడు సమీపంలోని మనవూరు వద్ద కుశస్థలిలో వరద ప్రవాహం చోటుచేసుకుంటోంది. దీంతో కుప్పంకండ్రిగ, బాగసాలై వద్ద రెండు కల్వర్టులను వరద ప్రవాహం ముంచెత్తింది. దీంతో తిరువళ్లూరు పేరంబాక్కంకు ప్రాంతాలకు వెళ్లు రోడ్డుకు మధ్యలో వరద చోటుచేసుకుని గ్రామీణులకు రాకపోకలు తెగి పది గ్రామాలకు చెందిన ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర సమయాల్లో 10 కిలోమీటర్ల దూరం వెళ్లి తిరువళ్లూరు, పేరంపాక్కం వెళ్లాల్సి వుంది. 40 ఏళ్లుగా వర్షాకాలంలో వరద చోటుచేసుకున్న సమయాల్లో కల్వర్టులు వరద ముంచెత్తున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయంగా బ్రిడ్జి నిర్మించాలని ఆ ప్రాంతం వాసులు కోరుతున్నారు. కనకమ్మసత్రంలో మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో కాలువలు ఆక్రమణకు గురికావడంతోపాటు పూడికతీత చేపట్టక పోవడంతో వరద ప్రవాహం గ్రామంలో చోరబడి ఇళ్లలో వరదపోటు చోటుచేసుకుంది. ఇళ్ల ముందు వరద నీటితో మూడు రోజుల నుంచి గ్రామీణులు ఇబ్బందులు చెందుతున్నారు.
కుశస్థలి పరవళ్లు


