బంగారుగుడిలో గురుస్థానం పూజ మండపం
–ప్రారంభించిన కేంద్రమంత్రి
శివరాజ్‌సింగ్ సౌకాన్
వేలూరు: వేలూరు శ్రీపురంలోని బంగారుగుడి ఆవరణలో గురుస్థానం పూజ మండపాన్ని శ్రీనారాయణి పీఠాధిపతి శక్తిఅమ్మ ఆధ్వర్యంలో కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్‌సింగ్ సౌకాన్ ప్రారంభించారు. అనంతరం ఆయన సతీమణి సాధనసింగ్‌తో కలిసి బంగారుగుడిని దర్శించుకొని నారాయణి ఆమ్మవారిని దర్శించుకున్నారు. ఆయనకు పీఠం సంప్రదాయం ప్రకారం అమ్మవారి ప్రసాదాలను అందజేశారు. అనంతరం పీఠంలోనే శక్తిఅమ్మ అధ్యక్షతన జరిగిన మహాచండీ యాగ పూజలతో పాటు పూర్ణాహుతిలో పాల్గొని ప్రత్యేక పూజలు, ప్రార్థనలు జరిపారు. అనంతరం పీఠంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు.యాగ పూజల్లో వీఐటీ యూనివర్సిటీ ఉపాధ్యక్షుడు శంకర్ విశ్వనాథన్, నారాయణి పీఠం బంగారుగుడి డైరెక్టర్ సురేష్‌బాబు, నారాయణి ఆస్పత్రి డైరెక్టర్ బాలాజీ, మేనేజర్ సంపత్, ట్రస్టీ సౌందర్‌రాజన్, వివిధ దేశాల భక్తులు పాల్గొన్నారు.


