వీఐటీ బీటెక్ ప్రవేశ పరీక్షలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు
వేలూరు: వేలూరు వీఐటీ యూనివర్సిటీ పరిధిలోని వేలూరు, చైన్నె, ఆంధ్రప్రదేశ్‌లోని అమరావతి, మధ్య ప్రదేశ్‌లోని భోపాల్ బ్రాంచ్‌లలో 2026 సంవత్సరానికి గాను బీటెక్ ప్రవేశ పరీక్షలకు ఆన్‌లైన్ దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు చాన్స్‌లర్ విశ్వనాథన్ ఓ ప్రకటనలో తెలిపారు. ఇందులో.. వీఐటీలోని బయో మెడికల్ ఇంజినీరింగ్, బయో టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్, కెమికల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్, ఇన్‌ఫర్‌మేషన్ టెక్నాలజీ, మెకానికల్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్ అండ్ ఆటోమోటివ్ ఇంజినీరింగ్, స్పెలేజేషన్ ఎనర్జీ ఇంజినీరింగ్, ప్రొడక్ష్‌న్ అండ్ ఇండస్ట్రీయల్ ఇంజినీరింగ్ తదితర కోర్సుల్లో చేరేందుకు ఈ పరీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ పరీక్షలు 2026 ఏప్రిల్ 28 నుంచి మే 3వ తేదీ వరకు ఆన్‌లైన్ పద్ధతిలో దేశంలోని 134 ముఖ్య పట్టాణాల్లోని కాకుండా దుబాయ్, కువైట్, మస్కట్ వంటి ఇతర దేశాల్లోని తొమ్మిది పరీక్షా కేంద్రాల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. విద్యార్థులు వారి సొంత జిల్లా, చదివిన కళాశాల ప్రాంతాన్ని బట్టి పరీక్షా కేంద్రాన్ని నిర్ణయించుకునే అవకాశం కల్పించడం జరిగిందన్నారు.
కరూర్ బాధిత కుటుంబాలకు విజయ్ పరామర్శ.. రేపు
సాక్షి, చైన్నె: కరూర్ ఘటన బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు విజయ్ నిర్ణయించారు. వివరాలు.. చైన్నె కరూర్‌లో టీవీకే నేత విజయ్ ప్రచార సమయంలో చోటు చేసుకున్న పెను విషాదం గురించి తెలిసిందే. మరణించిన 41 మంది బాధిత కుటుంబాలు, గాయపడ్డ 160 మందిని పరామర్శించేందుకు విజయ్ నిర్ణయించారు. ఈ కుటుంబాలకు ఇప్పటికే మరణించిన వారికి రూ. 20 లక్షలు విజయ్ ప్రకటించారు. వీరందర్నీ ఒకే వేదికపై తీసుకొచ్చి పరామర్శించడమే కాకుండా, నష్ట పరిహారం అందిస్తూ, మరణించిన వారి కుటుంబాలను దత్తత తీసుకునే విధంగా విజయ్ కసరత్తులలో ఉన్నట్టుగా సమాచారాలు వెలువడ్డాయి. శుక్రవారం కరూర్‌లో విజయ్ పర్యటించేందుకు అనుమతి ఇవ్వాలని, భద్రత చర్యలు తీసుకోవాలని ఇప్పటికే టీవీకే వర్గాలు పోలీసులకు విజ్ఞప్తి చేశారు. అయితే, టీవీకే వర్గాలు ఎంపిక చేసిన వేదిక చిన్నదిగా ఉండడంతో ఏదేని కళాశాల మైదానాలను ఎంపిక చేసుకోవాలని పోలీసులు సూచించారు. అలాగే ఏర్పాటుకు సంబంధించిన సమగ్ర వివరాలను సమర్పించాలని సూచించారు. దీంతో పరామర్శలను వాయిదా వేసుకుంటూ వచ్చారు. చివరకు కరూర్‌లో అతి పెద్ద మైదానం, ఆడిటోరియం లేని దృష్ట్యా, బాధితులను చైన్నెకు తీసుకొచ్చి పరామర్శ ఏర్పాట్లు చేయడానికి టీవీకే వర్గాలు చర్యలు చేపట్టారు. ఇందుకోసం మహబలి పురం వద్ద అతి పెద్ద వేదికను ఎంపిక చేశారు. ఇక్కడకు బాధితులను తీసుకొచ్చి , వారికి అన్ని రకాల బస తదితర ఏర్పాట్లు చేయడానికి ఏర్పాట్లు చేపట్టారు. ఈమేరకు (27వ తేదీ)సోమవారం బాధితులను విజయ్ పరామర్శించి, నష్ట పరిహారం అందించనున్నట్టు టీవీకే వర్గాలు పేర్కొంటున్నాయి.
డీఎంకే వ్యతిరేకులు ఏకం కావాలి!
– టీఎంసీ భేటీలో పిలుపు
సాక్షి, చైన్నె : డీఎంకేను గద్దె దించాలంటే, ఆ కూటమికి వ్యతిరేకంగా ఉన్న శక్తులన్నీ ఒకే వేదికపైకి రావాలని తమిళ మానిల కాంగ్రెస్ రాష్ట్ర సర్వసభ్య సమావేశంలో పిలుపు నిచ్చారు. ఇందుకు సంబంధించి తీర్మానం చేశారు. తమిళ మానిల కాంగ్రెస్ సర్వసభ్య సమావేశం శనివారం పల్లావరంలో జరిగింది. పార్టీ అధ్యక్షుడు, ఎంపీ జీకే వాసన్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి సర్వసభ్య సభ్యులు, ముఖ్య నేతలు, రాష్ట్ర కార్యవర్గం హాజరయ్యారు. ఇందులో జీకే వాసన్ మాట్లాడుతూ, పార్టీ బలోపేతం దిశగా ముందడుగు వేయాలని నేతలకు సూచించారు. ఈసారి పార్టీ తరపున ప్రతినిధులు అసెంబ్లీలో అడుగు పెట్టే విధంగా పనుల వేగం పెంచాలని సూచించారు. బలం ఉన్న నియోజకవర్గాలను గుర్తించి, ప్రజలతో మమేకం అయ్యే విధంగా కార్యక్రమాలు విస్తృతం, ప్రజా సమస్యలపై పోరాటాలు చేపట్టాలని సూచించారు. 2026 అసెంబ్లీ ఎన్నికలలో అన్నాడీఎంకే నేతృత్వంలోని కూటమి విజయానికి నేతలందరూ శ్రమించాలని సూచించారు. డీఎంకే ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞతో అడుగులు వేయాలన్నారు. ఈ ఎన్నికలలో డీఎంకే కూటమిని ఓడించాలన్నా, డీఎంకే అవినీతి పాలనకు చరమ గీతం పాడాలన్నా, వీరిని వ్యతిరేకించే పార్టీలు అన్నీ ఏకం కావాలని పిలుపునిచ్చారు. ఇందుకు సంబంధించి తీర్మానం కూడా చేశారు.
వీఐటీ బీటెక్ ప్రవేశ పరీక్షలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు
వీఐటీ బీటెక్ ప్రవేశ పరీక్షలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు


