ఐడియాస్ టూ ఇంపాక్ట్
ఎన్‌ఐఆర్‌ఎఫ్ ర్యాకింగ్‌లో మరోమారు నంబర్– 1 స్థానం దక్కించుకున్న ఐఐటీ మద్రాసు తాజాగా ఐడియాస్ టూ ఇంపాక్ట్ చాలెంజ్‌పై దృష్టి పెట్టింది. శనివారం క్యాంపస్‌లో యువ ఆవిష్కర్తలు అభివృద్ధి చేసిన 38 పర్వావరణ ఆవిష్కరణల ప్రదర్శన నిర్వహించారు. స్థిరత్వం, వృత్తాకార ఆర్థిక వ్యవస్థ, వాతావరణ స్థితిస్తాపకతను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన ప్రదర్శనను ఐఐటీ మద్రాసు డైరెక్టర్ వి.కామకోటి, తమిళనాడు ప్రభుత్వ పర్యావరణ, వాతావరణ మార్పుల శాఖ ప్రత్యేక కార్యదర్శి అనురాగ్ మిశ్రా ప్రారంభించారు. అనంతరం ఇందులో విద్యార్థులు కొలువుదీర్చిన వివిధ ఆవిష్కరణలను వారు పరిశీలించారు. – సాక్షి, చైన్నె


