75 వేల మందితో ఓటరు జాబితా పనులు
– అర్చనా పట్నాయక్
సాక్షి, చైన్నె: రాష్ట్రంలో ఓటరు జాబితా సవరణ పనులకు 75 వేల మంది సిబ్బందిని నియమించినట్టు రాష్ట్ర ఎన్ని కల ప్రధాన అధికారి అర్చ నా పట్నాయక్ తెలిపారు. 2026 ఎన్నికల దృష్ట్యా, రాష్ట్రంలో తుది ఓటరు జాబితా తయారీపై ఎన్నికల అధికారులు దృష్టి పెట్టారు. కొత్త ఓటర్ల జాబితా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇందులో భాగంగా తాజాగా ఓటరు జాబితాలో మార్పు, చేర్పునకు సంబంధించిన పనులు, మరణించిన వారి పేర్ల తొలగింపు, కొత్త ఓటరు చేరిక, తదితర పనులకు కేంద్ర ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. ఈ వివరాలను శుక్రవా రం హైకోర్టుకు ఓ కేసు విచారణ సందర్బంగా సమర్పించారు. ఈ పరిస్థితులలో నవంబర్ 1వ తేదీ నుంచి ఈ పనులు చేపట్టేందుకు రాష్ట్ర ఎన్నికల అధికారి అర్చనా పట్నాయక్ జిల్లాల అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఓటరు జాబితా లో సమగ్ర పరిశీలన అన్నది జరగనన్నట్టు ఈ సందర్భంగా అర్చనా పట్నాయక్ పేర్కొన్నారు. ఇంటింటా వెళ్లి సిబ్బంది పరిశీలన జరుపుతారని పేర్కొన్నారు. పోలింగ్ బూత్ స్థాయిలో సమగ్ర పరిశీలన జరుగుతుందన్నారు.


