అజిత్ 64లో చాన్స్?
తమిళసినిమా: కోలీవుడ్‌లో అందరి దారి అజిత్ దారి వేరు అంటారు. ఇది అక్షరాల నిజం తనేంటో తన పని ఏంటో అంటూ చేసుకుంటూ పోయే నటుడు అజిత్. ఈ విషయాన్ని ఆయనే ఇటీవల ఓ భేటీలో మరోసారి స్పష్టం చేశారు. కాగా ఇటీవల కార్ రేస్ లపై ఆసక్తి చూపిస్తున్న ఈయన ప్రపంచ స్థాయి కార్యదర్శులు పాల్గొంటూ పథకాలను గెలుచుకుంటున్నారు. అలా దుబాయ్‌లో జరిగిన కార్ రేస్ పోటీల్లో మూడో స్థానంలో నిలిచి పథకాన్ని గెలుచుకున్నారు. అదేవిధంగా స్పెయిన్‌లో జరిగిన కార్ రేస్ పోటీల్లోనూ పాల్గొని మూడవ స్థానంలో నిలిచి పథకాలను తెలుసుకున్నారు. కాగా ఇంతకుముందు ఈయన నటించిన చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ. గత ఏప్రిల్ 10వ తేదీన విడుదలైన ఈ చిత్రం కమర్షియల్‌గా మంచి విజయాన్ని అందుకుంది. కాగా ఆరు నెలలకు కావస్తున్న అజిత్ నటించే తదుపరి చిత్రం ఇంకా ప్రారంభం కాలేదు. దీంతో ఆయన నటించే కొత్త చిత్రం గురించి అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో తనకు ఇటీవల గుడ్ బ్యాడ్ అగ్లీ వంటి మంచి కమర్షియల్ హిట్ చిత్రాన్ని ఇచ్చిన అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలోనే మళ్లీ నటించడానికి అజిత్ సిద్ధమవుతున్నారు. ఇది ఈయన నటించే 64 వ చిత్రం అవుతుంది. కాగా ఇందులో ఒక కీలక పాత్రలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించనున్నట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అదేవిధంగా ఈ క్రేజీ చిత్రంలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీలీలను నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇందులో వాస్తవం ఎంత అన్నది పక్కన పెడితే ఈ బ్యూటీ ఇప్పటికే పరాశక్తి చిత్రంలో శివకార్తికేయన్‌కు జంటగా నటిస్తున్న విషయం తెలిసింది. ఇకపోతే అజిత్ తన 65వ చిత్రానికి కూడా సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. విజయానికి కేజీఎఫ్ చిత్రం ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించనున్నట్లు టాక్ వైరల్ అవుతోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉందన్నది గమనార్హం.
అజిత్
శ్రీలీల
అజిత్ 64లో చాన్స్?


