న్యాయవాదులు విధుల బహిష్కరణ
తిరుత్తణి: న్యాయవాదిపై దాడిచేసిన ఇన్‌స్పెక్టర్‌పై చర్యలు తీసుకోవాలనే డిమాండ్‌తో న్యాయవాదులు కోర్టు విధులు బహిష్కరించి ఽగురువారం ధర్నా చేశారు. తిరుత్తణి కంబైన్డ్ కోర్టులోని మూడు న్యాయవాదుల సంఘాల ఆధ్వర్యంలో గురువారం కోర్టు ఆవరణలో ధర్నా నిర్వహించారు. వారు మాట్లాడుతూ తాగునీటి కోసం గ్రామీణులు రాస్తారోకో చేస్తే అందులో ఆ గ్రామానికి చెందిన న్యాయవాది అయ్యప్పన్ పాల్గొన్నారు. అతనిపై తిరుత్తణి ఇన్‌స్పెక్టర్ మదియరసన్, పోలీసులు దారుణంగా దాడిచేసినట్లు ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటం చేపట్టిన న్యాయవాదిపై దారుణంగా దాడి చేసిన ఇన్‌స్పెక్టర్‌పై చర్యలు తీసుకోవాలని తమ డిమాండ్ల పరిష్కారం కోసం మూడు రోజల పాటు కోర్టు బహిష్కరించనున్నట్లు తెలిపారు. న్యాయవాదుల విధుల బహిష్కరణతో కక్షిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఎదురవుతున్నాయి.


