వర్షపు నీరు తొలగించాలని రాస్తారోకో
వేలూరు: వేలూరు జిల్లా అనకట్టు నియోజకవర్గం పరిధిలోని వూసూరు సమీపంలోని తెల్లూరులో వందకు పైగా కుటుంబాలు నివశిస్తున్నాయి. వారం రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో వర్షపు నీరు పూర్తిగా ఆ ప్రాంతంలోని ఇండ్లు నీటితో నిండిపోయాయి. ఆ ప్రాంతం పల్లంగా ఉండడంతో నీరు పూర్తిగా ఇళ్లలోకి రావడంతో స్థానికులు కట్టుబట్టలతో బయట వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో స్థానికులు పలుమార్లు అధికారులకు తెలియజేసినా ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తూ స్థానికులు వూసూరు రోడ్డులో రాస్తారోకో చేశారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే నందకుమార్ వెంటనే అక్కడకు చేరుకొని స్థానికులతో చర్చించి జేసీబీ సాయంతో వర్షపు నీటిని బయటకు తీసేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళనకారులు రాస్తారోకోను విరమించారు.


