వారిద్దరు ద్రావిడ ఉద్యమ రక్షకులు
వీఐటీలో వైగో
వేలూరు: తందైపెరియార్, అన్నాదురైలో మన ద్రావిడ ఉద్యమ రక్షకులను వారి గురించి ప్రతిఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉందని డీఎండీకే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వైగో అన్నారు. వేలూరు వీఐటీ యూనివర్సిటీ ఆవరణలో నవలర్ చెజియన్ ఫౌండేషన్, భారతిదాసన్ తమిళ సాహిత్య వేదిక సంయుక్తంగా తందై పెరియార్, అన్నాదురై స్మారక ఉపన్యాస కార్యక్రమం వీఐటీ చాన్స్‌లర్ విశ్వనాథన్ అధ్యక్షతన జరిగింది. ఆయన మాట్లాడుతూ తమిళనాడులో ద్రావిడ భాష ఎందుకని ప్రతిఒక్కరూ అడుగుతున్నారని ద్రావిడ ఉద్యమం తమిళ భాష, సంస్కృతిని స్థానిక భాష లేకుండా కలిపిన తమిళ జాతీయవాదాన్ని సృష్టించిందన్నారు. ద్రావిడ ఉద్యమం వచ్చిన తరువాతనే పెరియార్, అన్నా వేసిన పునాది తమిళనాడు అభివృద్ధికి దారి తీసిందన్నారు. వైగో మాట్లాడుతూ 1949వ సంవత్సరంలో అన్నా నాయకత్వంలో డీఎంకే నుంచి ద్రావిడ కయగం రెండుగా విడి పోయిందన్నారు. వీటిపై అప్పట్లో పలు విమర్శలు వచ్చాయన్నారు. ద్రావిడ కయగం ఉన్నప్పుడు డీఎంకే ఎందుకని పలువురు నిలదీశారన్నారు. ఆర్యమాయ అనే పుస్తకాన్ని రాసిన తందై పెరియార్, పొన్మోలిగల్ అనే పుస్తకాన్ని రాయడంతో అన్నాదురై జైలుపాలు అయ్యారన్నారు. ద్రావిడర్ కయగం నేత కి.వీరమణి, వీఐటీ యూనివర్సిటీ ఉపాధ్యక్షుడు శంకర్, జీవీ సెల్వం పాల్గొన్నారు.
వారిద్దరు ద్రావిడ ఉద్యమ రక్షకులు


