ఘనంగా పర్యాటక అవార్డుల ప్రదానం
కొరుక్కుపేట: పర్యాటక రంగంలో సమర్థంగా పనిచేస్తున్న 31 పరిశ్రమలు, ప్రభుత్వ విభాగాలు, పర్యాటక నిర్వాహకులకు తమిళనాడు పర్యాటక అవార్డులను రాష్ట్ర ఆరోగ్య ప్రజా సంక్షేమ శాఖ మంత్రి ఎం. సుబ్రమణియన్, హిందూ మత వ్యవహారాలు, ధార్మిక ధార్మిక శాఖ మంత్రి పి.కె. శేఖర్ బాబు ప్రదానం చేశారు. తమిళనాడు పర్యాటక అవార్డులు 2025 ప్రదానోత్సవం చైన్నెలోని ఓ హోటల్‌లో గురువారం జరిగింది. ఈ కార్యక్రమంలో 31 పారిశ్రామిక సంస్థలు, హోటళ్లు, ట్రావెల్ ఏజెన్సీలు ప్రభుత్వ శాఖలతో సహా పర్యాటక నిర్వాహకులను గౌరవనీయ మంత్రి తమిళనాడు పర్యాటక అవార్డులతో సత్కరించారు.రాష్ట్ర ముఖ్యమంత్రి అద్భుతమైన కృషి కారణంగా, తమిళనాడు ప్రస్తుతం పర్యాటక రంగంలో దేశంలోనే అగ్రగామిగా ఉందని. దేశ సామాజిక–ఆర్థిక అభివృద్ధిలో పర్యాటకం ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని అన్నారు. తమిళనాడును సందర్శించే విదేశీ పర్యాటకుల సంఖ్యను పెంచడానికి వివిధ కార్యకలాపాలు చేపడుతోందని దీనిని అనుసరించి ముఖ్యమంత్రి స్టాలిన్ మార్గదర్శకత్వం ప్రకారం, పర్యాటక అభివద్ధిలో ప్రధాన పాత్ర పోషిస్తున్న వివిధ పర్యాటక వ్యవస్థాపకులను ప్రోత్సహించడానికి తమిళనాడు పర్యాటక అవార్డులను ప్రదానం చేయనున్నట్లు ప్రకటించి 2022 నుంచి ఈ అవార్డులను అందజేస్తున్నట్లు వెల్లడించారు. కాగా ఈ సంవత్సరం పర్యాటక రంగం ద్వారా 13 రకాల అవార్డులు అందించినట్లు మంత్రులు పేర్కొన్నారు.


