మీతో స్టాలిన్‌కు పోటెత్తిన జనం
పళ్లిపట్టు: అత్తిమాంజేరిపేటలో గురువారం నిర్వహించిన మీతో స్టాలిన్ శిబిరానికి గ్రామీణులు పోటెత్తారు. పళ్లిపట్టు యూనియన్‌లోని అత్తిమాంజేరిపేట ప్రభుత్వ మహోన్నత పాఠశాలలో గురువారం మీతో స్టాలిన్ శిబిరం నిర్వహించారు. కొడివలస, నొచ్చిలి, కృష్ణమరాజుకుప్పం, అత్తిమాంజేరి గ్రామ పంచాయతీలకు సంబంధించి ప్రజలు శిబిరంలో పాల్గొన్నారు. శిబిరాన్ని తిరుత్తణి ఎమ్మెల్యే చంద్రన్ ప్రారంభించారు. మహిళలకు ఆర్థికసాయం, ప్రత్యేక ప్రతిభావంతులకు గుర్తింపు కార్డులు, ఉచిత ఇంటి పట్టాలు సహా వివిధ సహాయకాలు కోసం మహిళలు సహా వృద్ధులు పోటెత్తి అధికారుల వద్ద వినతిపత్రాలు అందజేశారు. ఉదయం నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించిన శిబిరంలో రెండు వేల మంది పాల్గొని వినతిపత్రాలు అందజేశారు. అధికారులు వినతిపత్రాలు స్వీకరించి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసి 30 రోజుల్లో సమస్యలు పరిష్కరించి ప్రభుత్వ సహాయకాలు, సర్టిఫికెట్లు పంపిణీ చేయాలని ఎమ్మెల్యే చంద్రన్ అధికారులకు సూచించారు.


