అలర్ట్
● నేడు బంగాళాఖాతంలో అల్పపీడనం ● చైన్నెలో ఎలాంటి విపత్తునైనా ఎదుర్కొనేందుకు సన్నద్ధం ● పనుల పరిశీలనలో మంత్రులు ● నిండుకుండలుగా రిజర్వాయర్లు
ఆరు జిల్లాలకు
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం శుక్రవారం ఏర్పడనుంది. ఈ ప్రభావంతో కోయంబత్తూరు, నీలగిరి, ఈరోడ్ తదితర ఆరు జిల్లాలకు అలర్ట్ ప్రకటించారు. ఈ ద్రోణి ప్రభావం అది ప్రయాణించే మార్గాన్ని బట్టి తెలుస్తుందని వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఇక గురువారం వరుణుడు చైన్నె , శివారులలో కాస్త తెరపించినట్టు కనిపించినా, సాయంత్రం నుంచి వాతావరణం పూర్తిగా మారింది.
చైన్నె శివారులలో గతుకుల మయంలో ఉన్న రోడ్డు
మెరీనా బీచ్ మట్టి దిబ్బలలో చేరిన వర్షపు నీరు
సాక్షి, చైన్నె: ఈశాన్య రుతు పవనాలు రాష్ట్రంలో విస్తరించిన నేపథ్యంలో బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా మారుతుందని ఎదురు చూశారు. అయితే, అది తీవ్ర అల్పపీడనంగా మారి చివరకు బలహీన పడింది. దీని ప్రభావంతో ఉత్తర తమిళనాడుతో పాటూ డెల్టాలో పలు జిల్లాలో భారీగానే వర్షం పడింది. ఈ వర్షం కారణంగా తంజావూరు, తిరువారూర్ జిల్లాలో పెద్ద ఎత్తున వరిపంట దెబ్బ తింది. ఈ పరిస్థితులలో శుక్రవారం బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది. వరుసగా వస్తున్న ద్రోణిల ప్రభావంతో అధికంగానే ఉంటుందని గ్రహించిన అధికార యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరించే పనిలో నిమగ్నమైంది. ఇప్పటికే మేట్టూరు జలాశయం పూర్తిగా నిండింది. హొగ్నెకల్ వద్ద కావేరిలో నీటిఉధృతి సెకనుకు 45 వేల క్యూసెక్కులుగా ఉంది. మేట్టూరులోకి వచ్చే ఈ నీటిని పూర్తిగా బయటకు విడుదల చేస్తున్నారు. దీంతో కావేరి తీరంలోనిడెల్టా జిల్లాలకు అలర్ట్ ప్రకటించారు. కావేరిలో మరింతంగా నీటి ఉధృతి పెరిగే అవకాశాతో తీర గ్రామాల ప్రజలు నది వైపుగా వెళ్ల వద్దు అని హెచ్చరికలు చేయడమే కాకుండా, ఆ పరిసరాలలో కల్వర్టు మార్గాలను మూసివేశారు. కావేరి తీరంలోని కొల్లిడం వద్ద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఇక మదురై వైపుగా వైగై నది పరవళ్లు తొక్కుతోంది. ఈరోడ్డు భవానీ సాగర్ నీటి మట్టం 102 అడుగులకు చేరింది. ఈ డ్యాం నీటి మట్టం 105 అడుగులకు చేరగానే ఉబరి నీటి విడుదలకు అధికారులు సిద్ధమయ్యారు. ఈరోడ్‌లోని మణియారు, పాలారు నదులలలో నీటి ఉధృతి పెరిగింది. విల్లుపురంలోని 39 అడుగులతో కూడిన వీడురు రిజర్వాయర్ 31 అడుగులకు చేరింది. కొడి వేరి డ్యాం నిండడంతో ఉబరి నీటిని విడుదల చేస్తున్నారు. ఇక్కడి సెంజి శంకరాభరణి నదిలో నీటి ఉధృతి పెరగడంతో ఆ పరిసర వాసులను అప్రమత్తం చేశారు.
అల్పపీడన ద్రోణి..
ఈశాన్య రుతు పవనాల రాకతో బయలు దేరిన తొలి అల్పపీడనం బలహీన పడ్డప్పటికీ, శుక్రవారం మరొకటి ఏర్పడనుంది. బంగాళాఖాతంలో బయలుదేరనున్న ఈ ద్రోణి ప్రభావంతో కోయంబత్తూరు, నీలగిరి, ఈరోడ్, తిరుప్పూర్, తదితర ఆరు జిల్లాలకు ఆరంజ్ అలర్ట్ ప్రకటించారు. ఈ జిల్లాలో శుక్రవారం నుంచి వర్షాలు ఉధృతి పెరగనున్నది. ఇప్పటికే ఈ జిల్లాలోని వర్షాలు పూర్తిగా స్థాయిలో నైరుతీ రుతు పవనాల రూపంలో కురిశాయి. నిండుకుండలుగా రిజర్వాయర్లు ఉన్నారు. దీంతో వీటిపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ ద్రోణి తదుపరి వరసుగా మరికొన్ని బంగాళాఖాతంలో ఏర్పడే పరిస్థితులు నెలకొని ఉన్నాయి. దీంతో 26వ తేదీ నుంచి రాష్ట్రంలోని అన్ని సముద్ర తీర , డెల్టా, ఉత్తర తమిళనాడులోని జిల్లాలో ఆశాజనకంగా వర్షాలు పడనున్నాయి. చైన్నె, శివారు జిల్లాలో వర్షాలు సంవృద్ధిగా పడే అవకాశాలతో అధికార యంత్రాంగం ముందస్తు చర్యలు విస్తృతం చేసింది. 1,436 మోటారు పంపులు లోతట్టు ప్రాంతాలలోనూ, 298 ట్రాక్టర్లతో కూడిన మోటారు పంపు సెట్లు ఇతర ప్రాంతాలలోను సిద్ధం చేసి ఉంచారు. డిప్యూటీ సీఎం ఉదయనిధి ఓ వైపు, మంత్రులు శేఖర్‌బాబు, నెహ్రూ తదితరులు మరోవైపు చైన్నెలో ఎలాంటి వరద ముంపు అన్నది ఎదురు కాకుండా ముందస్తు పనులపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇక నీలగిరులలో ఇప్పటికే వర్షాలు ముంచెత్తిన నేపథ్యంలో ఆ జిల్లా యంత్రాంగం మరింత అలర్ట్ అయింది. అలాగే కున్నూరు – ఊటీ రైల్వే మార్గంలో విరిపడ్డ కొండ, మట్టి చరియలను తొలగించే పనులు వేగంగా జరుగుతున్నాయి.
అలర్ట్
అలర్ట్
అలర్ట్


