సమష్టిగా విపత్తులను ఎదుర్కొంద్దాం..
చైన్నెలో ముందస్తు చర్యలన పరిశీలించిన డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ మీడియాతో మాట్లాడుతూ సమష్టిగా ఎలాంటి విపత్తులు ఎదురైనా ఎదుర్కొంద్దామన్నారు. ఇక సీఎం స్టాలిన్ చైన్నె కార్పొరేషన్ అధికారులకు ప్రత్యేక సూచనలు చేశారు. చైన్నె నగరంలో 22 సబ్ వేలలో చేరిన నీటిని తొలగించామన్నారు. 68 చోట్ల వంటలతయారీకి చర్యలు తీసుకున్నామని, 1,48,450 మందికి ఆహారం అందించే విధంగా ఏర్పాట్లు చేశామన్నారు. 454 ట్యాంకర్ల ద్వారా నీటిని అందించేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. చైన్నె కార్పొరేషన్‌కు సంబంధించి వర్షాల సమయాలలో ఫిర్యాదులు,సత్వర సేవలకు 1913 ,1916 టోల్ ఫ్రీం నెంబర్లను సంప్రదించాలని సూచించారు.


