
ప్రాణం తీసిన అనుమానం
–భార్యను హతమార్చి పాతిపెట్టిన భర్త
– రెండు నెలల తరువాత వెలికితీత
తిరువళ్లూరు: భార్య ప్రవర్తనపై అనుమానంతో దారుణంగా హత్య చేసిన భర్త డ్రమ్‌లో మృతదేహాన్ని వుంచి పాతిపెట్టిన సంఘటన రెండు నెలల తరువాత ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తిరువళ్లూరు జిల్లా గుమ్మిడిపూండి తురైపాళ్యం గ్రామానికి చెందిన శిలంబరసన్(39). పెయింటింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇతడికి ప్రియ అనే యువతిలో ఆరేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. ఈక్రమంలో ప్రియ ప్రవర్తనపై అనుమానంతో తరచూ శిలంబరసన్ గొడవ ఆమెతో పడేవాడు. భర్త వేధింపులు తాళలేక తరచూ పుట్టింటికి ప్రియ వెళ్లిపోయింది. దీంతో శిలంబరసన్ భార్యకు నచ్చచెప్పి ఇంటికి తీసుకొచ్చినట్టు తెలిసింది. ఈక్రమంలో పుట్టింటి నుంచి వచ్చిన తరువాత ప్రియ అదృశ్యమైంది. అయితే పొరుగింటి వారితో, తనతో గొడవ పడి మళ్లీ పుట్టింటికి వెళ్లిపోయినట్టు శిలంబరసన్ నమ్మించాడు. దీపావళి పురస్కరించుకుని ప్రియ సోదరులు ఆమె ఇంటికొచ్చారు. ప్రియ ఇంట్లో లేకపోవడంతో శిలంబరసన్‌ను నిలదీశారు. ప్రియ ప్రవర్తన సరిగ్గా లేకపోవడంతో 2నెలల క్రితమే ఆమెను హత్య చేసి డ్రమ్‌లో వుంచి పాతిపెట్టినట్టు చెప్పాడు. వారు ఆరంబాక్కం పోలీసులకు ిఫిర్యాదు చేశారు. పోలీసులు శిలంబరసన్‌ను అదుపులోకి తీసుకుని విచారణ జరిపారు. ప్రియను హత్య చేసి ఎలాపూర్‌లోని బ్రిడ్జి సమీపంలో పాతిపెట్టినట్టు నేరం అంగీకరించాడు. మృతదేహానికి పోస్టుమార్టమ్ నిర్వహించారు. అనంతరం నిందితుడిని అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.