
బంగారుగుడిలో 10,008 దీపారాధన పూజలు
బంగారు గుడిలో నక్షత్ర ఆకారంలో వెలిగించిన 10,008 దీపాలు, దీపారాధన పూజలు చేస్తున్న పీఠాధిపతి శక్తిఅమ్మ
వేలూరు: వేలూరు శ్రీపురం బంగారుగుడిలో ప్రపంచశాంతి కోసం 10,008 దీపాల పూజ మంగళవారం రాత్రి కనులపండువగా జరిగింది. దీపావళి పండుగను పురస్కరించుకొని ప్రతి సంవత్సరం దీపారాదన పూజలను శ్రీనారాయణి పీఠాధిపతి శక్తిఅమ్మ ఆధ్వర్యంలో నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. అందులోభాగంగా బంగారుగుడిలో నక్షత్ర ఆకారంలో 10,008 నేతి దీపాలను వెలిగించారు. ముందుగా శ్రీనారాయణి అమ్మవారికి వేద మంత్రాల నడుమ ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అలంకరణ, గోపూజ, తులసి పూజ, యాగపూజలు అతి వైభవంగా జరిగాయి. అనంతరం నారాయణి అమ్మవారికి ఊంజల్ సేవను శక్తిఅమ్మ చేతుల మీదుగా నిర్వహించారు. పీఠాధిపతి శక్తిఅమ్మ నక్షత్ర ఆకారంలో వెలిగించిన దీపాల వద్ద ప్రత్యేక యాగం చేశారు. ప్రపంచంలో దీపావళి రోజున ఎటువంటి ప్రమాదాలు జరకుండా కాపాడాలని, ప్రజలను సుఖసంతోషాలతో వుంచాలని యాగ పూజలు నిర్వహించారు. నక్షత్ర ఆకారంలో వున్న దీపాలను తీసుకొచ్చి భక్తులకు హారతిగా ఇచ్చారు. నారాయణి ఆస్పత్రి డైరెక్టర్ బాలాజి, బంగారుగుడి డైరెక్టర్ సురేష్‌బాబు, మేనేజర్ సంపత్, బంగారుగుడి ఆంధ్ర రాష్ట్ర పీఆర్‌ఒ కల్యాణ్, శక్తి అమ్మ భక్తులు అఽధిక సంఖ్యలో పాల్గొని శక్తి అమ్మకు పుష్పాలు సమర్పించి స్వామివారి ఆశీర్వాదాలు అందుకున్నారు.

బంగారుగుడిలో 10,008 దీపారాధన పూజలు